బాలి: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్‌గా జై షా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. బాలిలో ముగిసిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్లపాటు అతను ఈ పదవిలో కొనసాగనున్నాడు. 38 ఏళ్ల జై షా ఈ అత్యున్నత పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. 2024లో షా తొలిసారి చైర్మన్‌గా ఎన్నికయ్యాడు.
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ను విస్తరించడం, అభివృద్ధి చేయడం, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పునఃప్రవేశం వంటి కీలక అంశాలను దృష్టిలో ఉంచుకుని బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ విస్తరణకు మరింత కృషి చేస్తానని జై షా వెల్లడించాడు.
ఒలింపిక్స్‌లోకి క్రికెట్ తిరిగి రావడం, మన ఆటను కొత్త ప్రేక్షకులకు పరిచయం చేయడానికి, కొత్త తరం ఆటగాళ్లను ప్రేరేపించడానికి ఒక అసాధారణ అవకాశంగా లభించిందని షా పేర్కొన్నాడు. జై షా ఎన్నికపై క్రికెట్ లెజెండ్ సచిన్‌తో పాటు ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా తదితరులు అభినందనలు తెలిపారు.
