- అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రజాపాలన
- ఫ్రీ కరెంట్ స్కీమ్‌తో నెలకు రూ.1,200 ఆదా
- మెదక్‌లో పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ
- నర్సాపూర్/తొగుట/ములుగు, వెలుగు:
ప్రభుత్వం అందిస్తున్న చేయూత పింఛన్లు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇస్తున్నాయని కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్‌వెంకట స్వామి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించాలని, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. సోమవారం మెదక్‌జిల్లా నర్సాపూర్, సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లిలో కొత్త చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. గజ్వేల్‌లో మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ద్వారా మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఫ్రీ కరెంట్ స్కీమ్‌తో ప్రతి కుటుంబానికి నెలకు రూ.1,200 ఆదా అవుతోందని, ఉచిత బస్ ప్రయాణం కోసం మూడేండ్లలో ఆర్టీసీకి రూ.12 వేల కోట్లు ఇచ్చామన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.2,500 కోట్లు ఇచ్చామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలు చేస్తున్నామని తెలిపారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, టామ్ కామ్ ద్వారా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అవహేళన చేసినా పింఛన్లు ఇస్తున్నం: మంత్రి వివేక్
సిద్దిపేట రూరల్, వెలుగు: నిధులు లేకుండా కొత్త పింఛన్లు ఎలా ఇస్తారని ఎందరో అవహేళన చేసినా 4 లక్షల మందికి పింఛను ఇస్తున్నామని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం సిద్దిపేటలో జిల్లా కలెక్టర్ కె. హైమావతితో కలిసి 2,477 మంది లబ్ధిదారులకు కొత్త చేయూత పింఛన్ల ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్న వారందరికీ చేయూత పింఛన్లు అందించే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. త్వరలోనే సిద్దిపేటకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను మంజూరు చేస్తామని అన్నారు.
అనంతరం సిద్దిపేట కాంగ్రెస్ క్యాంప్ ఆఫీసులో బీఆర్ఎస్ కు చెందిన పొన్నాల సర్పంచ్ అమ్ముల వెంకటయ్య, వార్డు మెంబర్లు, 11 వ వార్డు లీడర్బింగి రాజు కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, వేముల వీరేశం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపెల్లి చంద్రం, నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ, ఆర్డీవో సదానందం, మార్కెట్ కమిటీ చైర్మన్లు దేవులపల్లి యాదగిరి, మీసం మహేందర్ యాదవ్, ఆత్మ చైర్మన్ పూజల గోపికృష్ణ, ఆర్టీఓ కమిటీ సభ్యులు సూర్యవర్మ పాల్గొన్నారు.
మరో 2 వేల ఇందిరమ్మ ఇండ్లు
సిద్దిపేట జిల్లాలో మహిళా సంఘాలకు రూ.330 కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామని మంత్రి వివేక్ తెలిపారు. దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలకు మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, రెండో విడతలో మరో 2 వేలు ఇస్తున్నామన్నారు. ఈ నెల 19న సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, సిద్దిపేట కలెక్టర్ హైమావతి, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, మెదక్, సిద్దిపేట జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్లు సుహాసినిరెడ్డి, దరిపల్లి చంద్రం, దుబ్బాక కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, నర్సాపూర్, దుబ్బాక మున్సిపల్ చైర్ పర్సన్లు లక్ష్మీ రాజు యాదవ్, శ్రీరామ్ సంగీత పాల్గొన్నారు.
