సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ ట్రోఫీలో హైదరాబాద్‌‌ బోణీ

సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ ట్రోఫీలో హైదరాబాద్‌‌ బోణీ

కోల్‌‌కతా: బౌలింగ్‌‌లో అజయ్‌‌ దేవ్‌‌ గౌడ్‌‌ (4/28), చామ మిలింద్‌‌ (3/20) రాణించడంతో.. సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ ట్రోఫీలో హైదరాబాద్‌‌ బోణీ చేసింది. సోమవారం జరిగిన గ్రూప్‌‌–డి రెండో మ్యాచ్‌‌లో ఒక్క వికెట్‌‌ తేడాతో చత్తీస్‌‌గఢ్‌‌పై గెలిచింది. టాస్‌‌ ఓడిన చత్తీస్‌‌గఢ్‌‌ 19.2 ఓవర్లలో 168 రన్స్‌‌కు ఆలౌటైంది. దేవ్‌‌ ఆదిత్య సింగ్‌‌ (47) టాప్‌‌ స్కోరర్‌‌. 

ఆయుష్‌‌ పాండే (37), ప్రతీక్‌‌ యాదవ్‌‌ (21) రాణించారు. తర్వాత హైదరాబాద్‌‌ 20 ఓవర్లలో 169/9 స్కోరు చేసి నెగ్గింది. హిమతేజ (37), అభిరత్‌‌ రెడ్డి (34), రాహుల్‌‌ బుద్ది (28), తనయ్‌‌ త్యాగరాజన్‌‌ (19), తన్మయ్‌‌ అగర్వాల్‌‌ (19) ఫర్వాలేదనిపించారు. దేవ్‌‌ ఆదిత్య, విజయ్‌‌ యాదవ్‌‌, జయంత్‌‌ యాదవ్‌‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అజయ్‌‌ దేవ్‌‌ గౌడ్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.