- రాష్ట్ర నూతన ఇన్చార్జ్ బీఎం సందీప్‌కు రాహుల్ దిశానిర్దేశం
న్యూఢిల్లీ, వెలుగు: పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ తెలంగాణలో పార్టీ శ్రేణులను ముందుకు నడిపించాలని రాష్ట్ర నూతన ఇన్చార్జ్ బీఎం సందీప్‌కు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు. సోమవారం ఢిల్లీలో రాహుల్ గాంధీని సందీప్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ పార్టీ ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు ఇద్దరూ చర్చించారు. సీఎం రేవంత్ నేతృత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించినట్టు తెలిసింది.
