ముంబైలో 200 మంది రెడీ.. అమితాబ్‌‌‌‌‌‌‌‌, అభిషేక్‌‌‌‌‌‌‌‌కు గ్యాంగ్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌ గోల్డీ ధిల్లాన్‌‌‌‌‌‌‌‌ బెదిరింపులు

ముంబైలో 200 మంది రెడీ.. అమితాబ్‌‌‌‌‌‌‌‌, అభిషేక్‌‌‌‌‌‌‌‌కు గ్యాంగ్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌ గోల్డీ ధిల్లాన్‌‌‌‌‌‌‌‌ బెదిరింపులు

ముంబై: బాలీవుడ్‌‌‌‌‌‌‌‌ నటులు అమితాబ్‌‌‌‌‌‌‌‌ బచ్చన్‌‌‌‌‌‌‌‌, ఆయన కుమారుడు అభిషేక్‌‌‌‌‌‌‌‌ బచ్చన్‌‌‌‌‌‌‌‌కు గ్యాంగ్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌ గోల్డీ ధిల్లాన్‌‌‌‌‌‌‌‌ నుంచి చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. తన అనుచరులు 200 మంది ముంబైలో సిద్ధంగా ఉన్నారని, ఢిల్లీ పోలీసులు తన ఇద్దరు అనుచరులను అరెస్టు చేసినంత మాత్రాన అమితాబ్‌‌‌‌‌‌‌‌పై దాడి ఆగదని ధిల్లాన్‌‌‌‌‌‌‌‌ సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో పోస్టు చేశాడు. 

సిక్కు సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని వదిలిపెట్టబోమని హెచ్చరిస్తూ, అమితాబ్‌‌‌‌‌‌‌‌, అభిషేక్‌‌‌‌‌‌‌‌ల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. బుల్లెట్‌‌‌‌‌‌‌‌ప్రూఫ్‌‌‌‌‌‌‌‌ రక్షణ ఏర్పాటు చేసుకున్నా కాల్చేస్తామంటూ బెదిరించినట్లు ఆ పోస్టులో పేర్కొన్నాడు. అయితే వైరల్ అవుతున్న ఈ సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా పోస్టు నిజమైనదా? అందులోని ఆరోపణలు ఎంతవరకు వాస్తవమనే విషయం నిర్ధారణ కాలేదు.

ఇద్దరు షూటర్ల అరెస్టు తర్వాత బెదిరింపులు 

అమితాబ్‌‌‌‌‌‌‌‌ నివాసం ‘జల్సా’ వద్ద కాల్పులకు కుట్ర పన్నారనే అనుమానంతో లారెన్స్‌‌‌‌‌‌‌‌ బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌ గ్యాంగ్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఇద్దరు షూటర్లను ఢిల్లీ పోలీసుల స్పెషల్‌‌‌‌‌‌‌‌ సెల్‌‌‌‌‌‌‌‌ ఇటీవల అరెస్టు చేసింది. వీరిని పంజాబ్‌‌‌‌లోని జలంధర్‌‌‌‌‌‌‌‌కు చెందిన వికాస్‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌ అలియాస్‌‌‌‌‌‌‌‌ విక్కీ, తరన్‌‌‌‌‌‌‌‌తరన్‌‌‌‌‌‌‌‌కు చెందిన దీపక్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ అలియాస్‌‌‌‌‌‌‌‌ దీప్‌‌‌‌‌‌‌‌గా 
గుర్తించారు. వీరు ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్తపై కాల్పులు జరిపే కుట్రతో పాటు అమితాబ్‌‌‌‌‌‌‌‌ నివాసం వద్ద దాడి ప్రణాళికతో సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యాపారవేత్తపై కాల్పుల బాధ్యత వికాస్‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌కు అప్పగించగా, అతను ఇందుకోసం ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు.