ఏనాటి వరమో నువ్వు.. ఆకట్టుకుంటున్న మైసా మూవీ సెకండ్ సాంగ్

ఏనాటి వరమో నువ్వు.. ఆకట్టుకుంటున్న మైసా మూవీ సెకండ్ సాంగ్

రష్మిక మందన్న  ఫిమేల్ లీడ్‌‌‌‌గా నటిస్తున్న చిత్రం ‘మైసా’.  రవీంద్ర పుల్లే దర్శకత్వంలో   అన్‌‌‌‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై అజయ్ నిర్మిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సోమవారం సెకండ్ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు. జేక్స్ బిజోయ్ కంపోజ్ చేసిన పాటకు రెహమాన్ లిరిక్స్ రాయగా, కృష్ణ తేజస్వి పాడిన తీరు ఆకట్టుకుంది. ‘నా కన్నుల్లో వెలుగై నువ్వుంటే.. మారాజు ఎవడంటా ఇక  నాకంటే.. ఏమో ఏమో.. ఏనాటి వరమో నువ్వు.. కన్నా.. నువ్వు పుట్టాకే తెలిసె బతుకంటే.. బ్రతికుంటానా నువ్ కానరాకుంటే.. ఏదో ఏదో.. విడిపోని ముడివైనావో.. నా ఎదగూటిలో నువ్వు  ఒదిగుండిపోవా.. కనురెప్పై కాస్తానే నా గువ్వ.. ఏ ప్రళయాలు ఎదురైనా  ప్రాణంలో  ప్రాణంగా కడదాకా ఉంటానులే.. నాలో నువ్వు ఉన్నావే.. కన్నా నీకై నేనున్నాలే..నేనంటే నువ్వే నువ్వే.. ’ అంటూ ఫాదర్ అండ్ డాటర్ మధ్య  ఎమోషనల్‌‌‌‌గా సాగిందీ పాట. 

రష్మిక తండ్రిగా సముద్రఖని కనిపిస్తుండగా, ఆమె చిన్ననాటి జ్ఞాపకాలతో, పచ్చని పైరు మధ్య  సాగిన పాట విజువల్స్‌‌‌‌తోనూ  ఆకట్టుకుంది. ఈ చిత్రంలో   గోండు గిరిజన మహిళగా రష్మిక నటించగా, ఆమె తల్లిగా ఈశ్వరి రావు కనిపించింది. గురు సోమసుందరం, రావు రమేష్, రాహుల్ రవీంద్రన్, శివ కందుకూరి, తారక్ పొన్నప్ప, కార్తీక్ రంజిని  కీలక పాత్రలు పోషించారు.  నవంబర్ 27న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా సినిమా  విడుదల  కానుంది.తండ్రి