శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మన డాక్టర్ బాబే’. మోహన సిద్ధి, శృతి శంకర్ హీరోయిన్స్. అలీ, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలు పోషించారు. తెరు చలపతి కుమార్ పువ్వల దర్శకత్వంలో కృతాక్షి నిర్మించారు. నవంబర్ 20న సినిమా విడుదల కానుంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అతిథిగా హాజరైన హీరో రాజ్ తరుణ్ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశాడు.
ఈ సందర్భంగా శ్రీ స్కంద మాట్లాడుతూ ‘నవ్విస్తూ మంచి సందేశాన్ని ఇచ్చేలా సినిమాని రూపొందించాం. ఎమోషన్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. ఆడియెన్స్ పెట్టే డబ్బులు వృథా కావు’ అని చెప్పాడు. కథలో బలం ఉన్న చిత్రాలను ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన అలీ అన్నారు. అందర్నీ ఎంటర్టైన్ చేసేలా ఉంటుందని దర్శకుడు చలపతి కుమార్ చెప్పాడు. హీరోయిన్స్ సహా మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.
