ప్రతి బూత్ కు  ఓట్ రక్షక్.. 35 వేల మందిని నియమించిన పీసీసీ చీఫ్ 

ప్రతి బూత్ కు  ఓట్ రక్షక్.. 35 వేల మందిని నియమించిన పీసీసీ చీఫ్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్‌‌‌‌‌‌‌‌లకు పార్టీ తరుపున ఓట్ రక్షక్‌‌‌‌‌‌‌‌లను నియమిస్తూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ప్రకటన విడుదల చేశారు. గతంలో సర్ పై పార్టీ తరపున నియమించిన బీఎల్ఏలనే ప్రస్తుతం బూత్ కు ఓట్ రక్షక్ గా నియమించినట్లు వెల్లడించారు. సర్ ప్రక్రియలో ఓట్లను కాపాడుకోవడంలో భాగంగా ఈ నియామకాలను పీసీసీ చేపట్టింది. రాష్ట్రంలో మొత్తం 38 వేలకు పైగా బూత్ లు ఉండగా 35 వేలకు పైగా బూత్ లకు ఓట్ రక్షక్ లను పీసీసీ నియమించింది.