- మణిపూర్ కమిటీ చైర్మన్‌గా బీఎం సందీప్‌కు బాధ్యతలు
- ప్రకటించిన నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్
న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో అసెంబ్లీ ఎన్నికలను జరగనున్న ఐదు రాష్ట్రాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాలకు స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో ఈ నియామకాలుచేపట్టినట్లు అందులో పేర్కొన్నారు. ప్రతి రాష్ట్ర కమిటీ బాధ్యతలు ముగ్గురికి అప్పగించారు.
ఉత్తరప్రదేశ్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్‌ను నియమించారు. పంజాబ్‌కు డాక్టర్ సిరివెళ్ల ప్రసాద్, ఉత్తరాఖండ్‌కు దీపా దాస్ మున్షి, గోవా బాధ్యతలు కేజే జార్జ్‌కు హైకమాండ్అప్పగించింది. కాగా.. జాతి సమస్యతో రగిలిపోతోన్న మణిపూర్ రాష్ట్ర బాధ్యతలు తెలంగాణ పార్టీ ఇన్‌చార్జ్ బీఎం సందీప్‌కు ఇచ్చింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు.
