అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఏఎస్ఆర్బీ) సెంట్రలైజ్డ్ కంబైన్డ్ ఎగ్జామినేషన్ – 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐటీఏఆర్) ఇన్స్టిట్యూట్స్, కృషి విజ్ఞాన్ కేంద్రాలు (కేవీకేఎస్) 1393 టెక్నికల్ అసిస్టెంట్ (టీ–3), సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (టీ–4) ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ స్వీకరణ ప్రక్రియ నవంబర్ 18న ప్రారంభం కానుండగా డిసెంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు.
పోస్టు పేరు: టెక్నికల్ అసిస్టెంట్ (టీ–-3), సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (టీ–4) .
మొత్తం ఖాళీలు: 1393. అన్ రిజర్వ్డ్ 642 (టీ–3 558, టీ–4 84), ఓబీసీ 306 (టీ–3 281, టీ–4 25), ఎస్సీ 178 (టీ–3 164, టీ–4 14), ఎస్టీ 97 (టీ–3 91, టీ–4 6), ఈడబ్ల్యూఎస్ 170 (టీ–3 160, టీ–4 10).
విభాగాల వారీగా ఖాళీలు
టెక్నికల్ అసిస్టెంట్ టీ–3 (1254 పోస్టులు) ఫీల్డ్ ఫార్మ్ టెక్నీషియన్ – అగ్రిల్చర్ 476, లాబొరేటరీ టెక్నీషియన్– అగ్రికల్చర్ 223, ఫీల్డ్ ఫార్మ్ టెక్నీషియన్ – అనిమల్ సైన్స్ 50, లాబొరేటరీ టెక్నీషియన్ అనిమల్ సైన్స్ 65, ఫీల్డ్ ఫార్మ్ టెక్నీషియన్ -ఫిషరీస్ సైన్స్ 57, లాబొరేటరీ టెక్నీషియన్- ఫిషరీస్ సైన్స్ 33, ఫీల్డ్ ఫార్మ్ టెక్నీషియన్ హోమ్ సైన్స్/ కమ్యూనిటీ 2, లాబొరేటరీ టెక్నీషియన్ – హోమ్ సైన్స్/ కమ్యూనిటీ 3, వర్క్ షాప్ స్టాఫ్ – సివిల్ ఇంజినీరింగ్ 51, వర్క్ షాప్ స్టాఫ్ – అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ 42, వర్క్ షాప్ స్టాఫ్ – ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 35, వర్క్ షాప్ స్టాఫ్ – ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ 25, లైబ్రరీ/ ఇన్ఫర్మేషన్ సైన్స్/ డాక్యుమెంటేషన్ స్టాఫ్ 59, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 133.
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ టీ–4 (139 పోస్టులు)
ఫీల్డ్ ఫార్మ్ టెక్నీషియన్ - అగ్రిల్చర్ 47, లాబొరేటరీ టెక్నీషియన్- అగ్రికల్చర్ 26, ఫీల్డ్ ఫార్మ్ టెక్నీషియన్ - అనిమల్ సైన్స్ 1, లాబొరేటరీ టెక్నీషియన్ అనిమల్ సైన్స్ 8, ఫీల్డ్ ఫార్మ్ టెక్నీషియన్ హోమ్ సైన్స్/ కమ్యూనిటీ 1, లాబొరేటరీ టెక్నీషియన్ - హోమ్ సైన్స్/ కమ్యూనిటీ 1, లాబొరేటరీ టెక్నీషియన్- ఫిషరీస్ సైన్స్ 7, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 48.
విద్యార్హతలు
ఫీల్డ్/ ఫార్మ్ & ల్యాబొరేటరీ టెక్నీషియన్
(అగ్రికల్చర్): అగ్రికల్చర్, హార్టికల్చర్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, అగ్రో–-ఫారెస్ట్రీ, ఫుడ్ సైన్స్, బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, హోమ్ సైన్స్, కమ్యూనిటీ సైన్స్ లేదా నేచురల్ ఫార్మింగ్ విభాగంలో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
అనిమల్ సైన్స్ / వెటర్నరీ: బీవీఎస్సీ & ఏహెచ్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
ఫిషరీస్ సైన్స్ (మత్స్య విజ్ఞానం): బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ (బీఎఫ్ఎస్సీ).
హోమ్ సైన్స్ / కమ్యూనిటీ సైన్స్: హోమ్ సైన్స్ లేదా కమ్యూనిటీ సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ.
వర్క్‌షాప్ స్టాఫ్ (ఇంజినీరింగ్ విభాగాలు): సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, టెక్స్ టైల్ టెక్నాలజీలో బి.టెక్/ బీఈ లేదా మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
లైబ్రరీ / ఇన్ఫర్మేషన్ సైన్స్ / డాక్యుమెంటేషన్ స్టాఫ్: లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఐటీ, సీఎస్, ఈసీఈ విభాగాల్లో బి.టెక్/ బీఈ పూర్తిచేసి ఉండాలి.
వయసు: 2026, డిసెంబర్ 17 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. మరిన్ని వివరాలు వెబ్సైట్ www.asrb.gov.inను సందర్శించండి.
కంబైన్డ్ ప్రిలిమినరీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు. 60 నిమిషాల్లో పూర్తిచేయాలి. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. జనరల్ నాలెడ్డ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, జనరల్ ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, జనరల్ అగ్రికల్చర్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు అడుగుతారు.
కనీస అర్హత మార్కులు: అన్ రిజర్వ్డ్ 30 శాతం, ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ 25 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీలు 20 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
కంబైన్డ్ మెయిన్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు.మొత్తం 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు. రెండు గంటల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. మెయిన్స్ పేపర్ అభ్యర్థులు ఎంచుకున్న ఫంక్షనల్ గ్రూప్/ సబ్-గ్రూప్‌కు సంబంధించిన సబ్జెక్ట్-స్పెసిఫిక్ పరిజ్ఞానాన్ని పూర్తిగా పరీక్షిస్తుంది. తుది మెరిట్ జాబితా కేవలం మెయిన్స్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే రూపొందిస్తారు.
కనీస అర్హత మార్కులు: అన్ రిజర్వ్డ్ 30 శాతం, ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ 25 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీలు 20 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 18.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్ 300, ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ రూ.150 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు ఉండదు. రెండు పోస్టులకు అప్లై చేస్తే అన్ రిజర్వ్డ్ 600, ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ రూ.300 చెల్లించాలి.
లాస్ట్ డేట్: డిసెంబర్ 17.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తేదీ: 2027, ఫిబ్రవరి (తాత్కాలికం).
సెలెక్షన్ ప్రాసెస్: కంబైన్డ్ ప్రిలిమినరీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, షార్ట్ లిస్టింగ్, కంబైన్డ్ మెయిన్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
