బంగారానికి ఏమైందీ.. ఎందుకు ఇలా ధర పడిపోతుంది.. రోజు రోజుకు ఎందుకీ పతనం.. దీపావళి తర్వాత రోజు నుంచి మొదలైన పతనం.. ఆగకుండా కొనసాగుతుంది. ఇప్పుడు ఇదే మార్కెట్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. దీపావళి పండుగ నుంచి 2026, నవంబర్ 17వ తేదీ వరకు బంగారం ధర ఏకంగా 10 వేల రూపాయలు తగ్గింది. వారం రోజుల్లోనే.. 10 వేల రూపాయలు తగ్గటం ఇదే కావటం విశేషం.
దీపావళి రోజు.. అంటే 2026, నవంబర్ 8వ తేదీన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు లక్షా 43 వేల 570 రూపాయలు ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు లక్షా 31 వేల 600 రూపాయలుగా ఉంది.
ఇప్పుడు.. అంటే 2026, నవంబర్ 17వ తేదీన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు లక్షా 35 వేల 350 రూపాయలుగా ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు లక్షా 24 వేల 600 రూపాయలుగా ఉంది. ఈ ధరలు హైదరాబాద్ మార్కెట్ కు సంబంధించినవి.
వారం రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర 10 వేల రూపాయలు తగ్గటం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నా.. కొనుగోలుదారులు మాత్రం హ్యాపీగా ఉన్నారు. పెళ్లిళ్ల సీజన్, శుభకార్యాలు ఉన్న ఈ సమయంలో.. బంగారం ధరలు తగ్గటంతో ఆనందంగా కొనుగోలు చేస్తున్నారు వినియోగదారులు.
బంగారం ధర తగ్గటానికి కారణం ఏంటీ :
బంగారం తగ్గటానికి అమెరికా డాలర్ విలువ పెరగటం ప్రధాన కారణంగా చెబుతున్నాయి మార్గెట్ వర్గాలు. ఈ క్రమంలోనే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచవచ్చనే వార్తలతో బంగారం వైపు పెట్టుబడులు తగ్గిపోయాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచితే.. బంగారంలో పెట్టుబడులు తగ్గిపోతాయి. ఇది మరో కారణంగా చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు. ఇదే క్రమంలో డాలర్ విలువ పెరగటంతో.. ఇతర దేశాల్లో బంగారం ధరలు పెరిగాయి. ఈ క్రమంలో ఆయా దేశాల్లో బంగారం కొనుగోళ్లు భారీగా తగ్గాయి. ఆయా దేశాల్లో బంగారానికి డిమాండ్ తగ్గటంతో.. మన దేశానికి సప్లయ్ పెరిగింది. సహజంగా సప్లయ్ పెరగటంతో ఇండియాలో బంగారం ధరలు తగ్గాయి.
భారతదేశంలో బంగారం ధరలు తగ్గటానికి మరో కారణం కూడా ఉంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచవచ్చని వార్తలతో.. చాలా మంది పెట్టుబడిదారులు తమ బాండ్లను బంగారం నుంచి ఉపసహంరించుకుంటున్నారు. బంగారంలోని పెట్టుబడులను డిపాజిట్లు, బాండ్ల వైపు మళ్లిస్తున్నారు. ఈ క్రమంలోనే బంగారం ధరలు తగ్గుతున్నాయి.
