అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో హోల్‌‌‌‌సేల్ ద్రవ్యోల్బణం 12 శాతం.. ఇంధనం, విద్యుత్‌‌‌‌ ధరలు పెరగడమే కారణం

అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో హోల్‌‌‌‌సేల్ ద్రవ్యోల్బణం 12 శాతం.. ఇంధనం, విద్యుత్‌‌‌‌ ధరలు పెరగడమే కారణం

న్యూఢిల్లీ: దేశంలో ఇంధనం, విద్యుత్, ఆహారేతర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో హోల్‌‌‌‌సేల్ ద్రవ్యోల్బణం12.29 శాతానికి ఎగబాకింది. 2022–23 బేస్ ఇయర్‌‌‌‌‌‌‌‌గా ఉన్న కొత్త హోల్‌‌‌‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) సిరీస్‌‌‌‌లో ఇదే అత్యధిక స్థాయి. సెప్టెంబర్‌‌‌‌లో ఇది 11.39 శాతంగా నమోదైంది.  ఇంధనం,  విద్యుత్ విభాగాల్లో ధరలు  25.85శాతం నుంచి ఏకంగా 32.84శాతానికి పెరిగాయి.

పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధి మూసివేత వల్ల ముడి చమురు, ఎరువుల ఖర్చులు పెరగడం ఇందుకు ప్రధాన కారణం.  అక్టోబర్‌‌లో ఆహార పదార్థాల హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 8.26శాతంగా, ఆహారేతర వస్తువులు 11.69శాతంగా, ఖనిజాలు 12.64శాతంగా నమోదైంది.  తయారీ వస్తువుల ధరల పెరుగుదల సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లోని  9.76శాతం నుంచి స్వల్పంగా తగ్గి అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో 9.54శాతంగా నమోదైంది.

వడ్డీ రేట్లు పెరగొచ్చు..

ఈ నెలలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌‌‌‌కు సుమారు 20 డాలర్లు తగ్గడంతో, నవంబర్‌‌‌‌లో హోల్‌‌‌‌సేల్ ద్రవ్యోల్బణం 11.5–11.6 శాతానికి దిగిరావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. మరోవైపు, అక్టోబర్ రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) రెండేళ్ల తర్వాత ఆర్బీఐ గరిష్ట పరిమితి దాటి 6.09 శాతానికి చేరుకోవడంతో, డిసెంబర్ 2–4 తేదీల్లో జరిగే ఆర్బీఐ పాలసీ సమీక్షలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.75 శాతానికి చేర్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.