న్యూఢిల్లీ: ఈక్విటీ పెట్టుబడులపై విధించే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌లో మార్పులు చేసే అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ సోమవారం తెలిపారు. బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలను విశ్లేషిస్తున్నామని, దీనిపై 2027–-28 కేంద్ర బడ్జెట్‌లో (ఫిబ్రవరి 1న) నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఆయన అన్నారు.
విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్‌టీసీజీ) ను రద్దు చేయాలని, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎస్‌టీసీజీ), సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్‌టీటీ) రేట్లను రేషనలైజ్ చేయాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి. షేర్లపై లాభం ఏడాదిలో రూ. 1.25 లక్షలు దాటితే ఎల్‌టీసీజీపై 12.5శాతం, ఎస్‌టీసీజీపై 20శాతం పన్ను విధిస్తున్నారు. ఈ హోల్డింగ్ టైమ్‌ను 18-–24 నెలలకు పెంచాలనే ప్రతిపాదన కూడా ఉంది.
