- చువ్వతోనే దవాఖానకు..
- సర్జరీ చేసి తీసేసిన డాక్టర్లు
కుత్బుల్లాపూర్, వెలుగు: షార్ట్‌కట్‌లో వెళ్దామని గేటు దూకే ప్రయత్నం చేయడంతో కాలుజారి ఒక యువకుడి కుడిచేతి మణికట్టులో ఇనుప చువ్వ దిగింది. ఆ చువ్వ నుంచి చేయి రాకపోవడంతో చువ్వను కట్‌చేసి దవాఖానకు తరలించి సర్జరీ చేసి తీసెయ్యాల్సి వచ్చింది. ఏపీకి చెందిన మణికంఠ(32) షాపూర్‌నగర్‌లోని ఓ హాస్టల్లో ఉంటూ కాంట్రాక్టర్లేబర్. సోమవారం ఉదయం తన మిత్రులతో కలిసి హాస్టల్నుంచి షాపూర్‌నగర్ మెయిన్రోడ్డువైపు వచ్చాడు. తిరిగి హాస్టల్‌కు వెళ్లే క్రమంలో దూరమవుతుందని షార్ట్‌కట్‌గా ఎంజే గార్డెన్ వద్ద ఉన్న భారీ ఇనుప గేటును దూకి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో కాలు జారి గేటుకు ఉన్న పదునైన ఇనుప కడ్డీ కుడిచేతి మణికట్టు లోపలికి దిగింది. తీవ్ర రక్తస్రావం, బాధతో విలవిలలాడుతుండగా స్థానికులు 108 కు సమాచారం ఇచ్చారు.
సిబ్బంది నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్మణికట్టులోకి దిగిన ఇనుప చువ్వను తీసేందుకు ప్రయత్నించగా వీలు కాలేదు. గంట పాటు శ్రమించి చువ్వను కట్‌చేసి ఆ ముక్కతోనే మణికంఠను దవాఖానకు తరలించారు. తర్వాత సర్జరీ చేసి తొలగించారు. కాగా, షాపూర్‌నగర్‌లోని ఓ కల్లుదుకాణం వద్ద మద్యంసేవించిన మణికంఠ ఆ మత్తులో గేటు ఎక్కడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది.
