సగరులను బీసీ- ఏ లోకి మార్చే వరకు ఉద్యమం : తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్‌‌‌‌‌‌‌‌

సగరులను బీసీ- ఏ లోకి మార్చే వరకు ఉద్యమం :  తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్‌‌‌‌‌‌‌‌
  •     తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్‌‌‌‌‌‌‌‌  
  •      కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ ఎదుట నిరసన 

సైఫాబాద్, వెలుగు: సమాజంలోని అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురవుతున్న సగరులను బీసీ -డీ నుంచి బీసీ -ఏ కేటగిరీలోకి మార్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్‌‌‌‌‌‌‌‌ సగర హెచ్చరించారు. 

సగరుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సోమవారం గ్రేటర్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ సగర సంఘం అధ్యక్షుడు మోడల రవి సగర ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు అందజేశారు.