- నవంబర్ 16 నుంచి డిసెంబర్ 20 వరకు..
- హైడ్రా పనుల నేపథ్యంలో నిర్ణయం
హైదరాబాద్ సిటీ, వెలుగు : హైడ్రా అభివృద్ధి పనుల దృష్ట్యా హైదరాబాద్‌లోని ఛే నంబర్జంక్షన్ నుంచి తిలక్ నగర్ వరకు ఉన్న రూట్లో నవంబర్ 16 నుంచి డిసెంబర్ 20 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) డి. జోయల్ డేవిస్ వెల్లడించారు. ఛే నంబర్జంక్షన్ నుంచి తిలక్ నగర్ వైపు వన్‌వే ఉంటుందని తెలిపారు.
తిలక్ నగర్ నుంచి ఛే నంబర్జంక్షన్ వైపు వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ఇందులో భాగంగా ఎన్సీసీ నుంచి అంబర్‌పేట వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు తిలక్ నగర్ కుడివైపు తీసుకుని, ఫీవర్ హాస్పిటల్,- బర్కత్‌పురా చమన్, టూరిస్ట్ హోటల్, నింబోలిఅడ్డా,- గోల్నాక , ఛే నంబర్మీదుగా వెళ్లాలి. విద్యానగర్ నుండి ఫీవర్ హాస్పిటల్మీదుగా అంబర్‌పేట వైపు వెళ్లాలంటే త్యాగరాయ గానసభ / టీ.వై. మండలి , బర్కత్‌పురా చమన్, - టూరిస్ట్ హోటల్, నింబోలిఅడ్డా, గోల్నాక, ఛే నంబర్ మీదుగా చేరుకోవాలి. ఇదొక్కటే కాకుండా ఆల్టర్నేట్రూట్కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ ఛే నంబర్ జంక్షన్ నుంచి తిలక్ నగర్ వైపు భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు వెళ్లలేకపోతే గోల్నాక నుంచి నింబోలి అడ్డా మీదుగా మళ్లిస్తారు. భారీ వాహనాలు మినహా ఫీవర్ హాస్పిటల్, ఎన్సీసీ వైపు నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలు తిలక్ నగర్ నుంచి బడా గణేశ్ లైన్, బతుకమ్మ కుంట రోడ్డు వైపు మళ్లిస్తారు. ఇది వన్‌వే గా ఉంటుంది.
