బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఆది సాయికుమార్ తాజాగా మరో చిత్రాన్ని ప్రకటించాడు. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాతో సక్సెస్ అందుకున్న రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆది నటించనున్నాడు. 7పీఎం ప్రొడక్షన్స్, శ్రీచక్ర మూవీస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్లపై సందీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని, డా.సూర్యకాంతి కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘అరుంధతి నక్షత్రం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను అనౌన్స్ చేశారు. తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా, ముహూర్తపు షాట్‌కు సాయికుమార్ క్లాప్ కొట్టారు. నిర్మాతలు రమేష్ పుప్పాల, సూర్యకాంతి కూచిభొట్ల కెమెరా స్విచాన్ చేశారు.
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న 28వ సినిమా ఇది. మేఘ శెట్టి, మధు దామరాజు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రూరల్ ఫ్యామిలీ డ్రామా కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అనౌన్స్‌మెంట్ సందర్బంగా విడుదల చేసిన వీడియో సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి మరిన్ని అప్‌డేట్స్ అందిస్తామని మేకర్స్ తెలియజేశారు.
