యష్ రాజ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది సెస్సో’. మౌపియా గౌస్వామి హీరోయిన్. ఈశ్వర్ పెంటి, పూజా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. బి.ఎన్. రవి నిర్మిస్తున్నారు. సోమవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. అతిథిగా హాజరైన హీరో ఆకాష్ జగన్నాథ్ ట్రైలర్ చాలా బాగుందని, సినిమా పెద్ద విజయం సాధించాలని విషెస్ చెప్పాడు.
మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, గండిపేట్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ యాదవ్, ప్రభు రావులకోలు, నర్సింగ్, శ్రావణ్ రావులకోలు కార్యక్రమానికి హాజరై టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. బేసిక్ హ్యూమన్ ఎమోషన్ నుంచి పుట్టిన ఈ సినిమా.. అందర్నీ ఆలోచింపజేసేలా ఉంటుంది అని హీరో, దర్శకుడు యశ్ రాజ్ తెలియజేశారు. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు హీరోయిన్ మౌపియ గౌస్వామి థ్యాంక్స్ చెప్పింది. అందరినీ అలరించేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాత బీఎన్ రెడ్డి తెలియజేశారు.
