మాట నిలబెట్టుకుని  సిద్దిపేటకు రావాలి : హరీశ్ రావు

మాట నిలబెట్టుకుని  సిద్దిపేటకు రావాలి : హరీశ్ రావు
  • రుణమాఫీ, రైతు భరోసా అమలు చేస్తే నేనే బొకే ఇచ్చి స్వాగతిస్తా: హరీశ్ రావు
  • కృష్ణా జలాల పరిరక్షణలో కాంగ్రెస్ సర్కార్ విఫలం
  • చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే మాపై బురదచల్లుతున్నరని ఫైర్

సిద్దిపేట రూరల్, వెలుగు: ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటకు రావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రుణమాఫీ, రైతు భరోసా పథకాలను అర్హులైన రైతులందరికీ అమలు చేస్తే తానే బొకే ఇచ్చి స్వాగతం పలుకుతానని చెప్పారు. సోమవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖను విడుదల చేసి మాట్లాడారు. 2024 మే 2న సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో కొమురవెల్లి మల్లన్న సాక్షిగా ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం హామీ ఇచ్చారని, ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. 

నీళ్ల విషయంలో చేతగానితనం..

కృష్ణా జలాల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీశ్ రావు ఆరోపించారు. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సావాస దోషం ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా అంటుకుందని, తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చారని పదేపదే అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.

సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకోవద్దు.. 

కేసీఆర్ మంజూరు చేసిన సిద్దిపేట వెటర్నరీ కాలేజీని కొడంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారని, దీనిపై సీఎం సిద్దిపేట ప్రజలకు సమాధానం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేటకు మంజూరైన రూ.1,070 కోట్ల పనులను రద్దు చేసి, నిధులు నిలిపివేశారని ఆరోపించారు. వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. 87 నియోజకవర్గాలకు మంజూరు చేసిన యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సిద్దిపేటకు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోస్తే సిద్దిపేట జిల్లాలో కరువు ఉండదని, కావాలనే నీటి సరఫరాను నిలిపివేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కొడంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తనపై రాజకీయ కోపం ఉంటే తనపైనే చూపించాలని, సిద్దిపేట ప్రజలపై చూపొద్దని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. రాజకీయ కక్షతో సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకోవద్దని కోరారు.

 రద్దు చేసిన రూ.1,070 కోట్లు విడుదల చేయాలి

హైదరాబాద్, వెలుగు: రాజకీయ కక్షతో సిద్దిపేటలో రద్దు చేసిన రూ.1,070 కోట్ల అభివృద్ధి నిధులను తక్షణమే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని​హరీశ్ రావు డిమాండ్ చేశారు. గత రెండు పర్యటనల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోనందుకు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మూడోసారి సిద్దిపేట పర్యటనకు వస్తున్న నేపథ్యంలో సోమవారం ఆయన సీఎంకు బహిరంగ లేఖ రాశారు.  ‘‘నా మీద రాజకీయ కక్ష ఉంటే నాతో తలపడండి.

నన్ను తిడితే ప్రజల కోసం భరిస్తా.. కానీ ఆ కక్షను సిద్దిపేట ప్రజలపై చూపకండి. 2024 మే 2న అంబేద్కర్ చౌరస్తాలో కొమురవెల్లి మల్లన్న సాక్షిగా 100% రుణమాఫీ చేస్తానని ప్రమాణం చేశారు. కానీ ఒక్క సిద్దిపేటలోనే ఇంకా 22,819 మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. 2026 మార్చి 22న నర్మెట్ట ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో 45 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతుభరోసా వేస్తామని చెప్పి 230 రోజులైనా పావు వంతు కూడా జమ చేయలేదు’’ అని లేఖలో పేర్కొన్నారు.