లక్ష్మీకాంత రెడ్డికి సేవారత్న అవార్డు

లక్ష్మీకాంత రెడ్డికి సేవారత్న అవార్డు

చేవెళ్ల, వెలుగు:  చేవెళ్ల మండలం ఈర్లపల్లికి చెందిన వనం లక్ష్మీకాంత్ రెడ్డికి సేవారత్న పురస్కారం లభించింది. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన బహుజన సాహిత్య అకాడమీ (బీఎస్ఏ) 20వ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌లో  సంస్థ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ ఈ అవార్డును అందజేశారు. 

దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల నుంచి దాదాపు 500 మంది ప్రముఖ ప్రతినిధులు ఈ వేడుకకు హాజరయ్యారు. తన సేవలను గుర్తించి అంతర్జాతీయ అవార్డును అందించిన బహుజన సాహిత్య అకాడమీ  సభ్యులు,  కేంద్ర ప్రభుత్వ అధికారులకు  లక్ష్మీకాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.