ఆ ఇద్దరు అమెరికా అధికారుల భరతం పడతాం.. మినాబ్ మారణ హోమంపై ఇరాన్ హెచ్చరిక

ఆ ఇద్దరు అమెరికా అధికారుల భరతం పడతాం.. మినాబ్ మారణ హోమంపై ఇరాన్ హెచ్చరిక

న్యూఢిల్లీ: ఇరాన్‌‌‌‌‌‌‌‌లోని మినాబ్‌‌‌‌‌‌‌‌ పట్టణంలో స్కూల్‎పై క్షిపణి దాడి జరిగి 168 మంది చిన్నారులు మరణించిన ఘటనపై ఇరాన్‌‌‌‌‌‌‌‌ మరోసారి తీవ్రంగా స్పందించింది. ఈ దాడికి ఆదేశాలిచ్చినట్లు ఆరోపిస్తున్న ఇద్దరు అమెరికా నేవీ అధికారులను ఎక్కడున్నా వెతికి పట్టుకుంటామని హెచ్చరించింది. దక్షిణాఫ్రికాలోని ఇరాన్‌‌‌‌‌‌‌‌ రాయబార కార్యాలయం ఎక్స్‌‌‌‌‌‌‌‌లో 'మిమ్మల్ని వెతికి పట్టుకుంటాం' అంటూ పోస్టు చేసింది. 

అమెరికా నేవీకి చెందిన కమాండర్‌‌‌‌‌‌‌‌ లీ ఆర్‌‌‌‌‌‌‌‌. టేట్, లెఫ్టినెంట్‌‌‌‌‌‌‌‌ కమాండర్‌‌‌‌‌‌‌‌ జెఫ్రీ ఈ. యార్క్‌‌‌‌‌‌‌‌ను ఇరాన్‌‌‌‌‌‌‌‌ లక్ష్యంగా చేసుకుంది. వీరు యూఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ స్ప్రూయాన్స్‌‌‌‌‌‌‌‌ యుద్ధనౌకలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మూడుసార్లు టోమాహాక్‌‌‌‌‌‌‌‌ క్షిపణులను ప్రయోగించేందుకు వీరు ఆదేశాలిచ్చారని, దీంతో మినాబ్‌‌‌‌‌‌‌‌లోని స్కూల్‎లో చిన్నారులు మరణించారని ఇరాన్‌‌‌‌‌‌‌‌ మార్చి 29న ఆరోపించింది. 'వీరికి సొంతంగా పిల్లలు లేరా?' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ట్రంప్‌‌‌‌‌‌‌‌ హెచ్చరికల నేపథ్యంలో..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌‌‌‌‌‌‌‌ ట్రంప్‌‌‌‌‌‌‌‌ ఇరాన్‌‌‌‌‌‌‌‌కు హెచ్చరికలు చేసిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడింది. అమెరికా ఉన్నతాధికారులను హత్య చేస్తే ఇరాన్‌‌‌‌‌‌‌‌ ఎక్కువకాలం ఉనికిలో ఉండదని ట్రంప్‌‌‌‌‌‌‌‌ హెచ్చరించారు. మరోవైపు, మరణ బెదిరింపుల నేపథ్యంలో అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌‌‌‌‌‌‌‌ బెసెంట్‌‌‌‌‌‌‌‌ను వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌ సమీపంలోని నివాసం నుంచి సైనిక స్థావరానికి తరలించారు. 

ఎన్డీటీవీ వరల్డ్‌‌‌‌‌‌‌‌ సమిట్‌‌‌‌‌‌‌‌‎లో ఇరాన్‌‌‌‌‌‌‌‌ సుప్రీం లీడర్‌‌‌‌‌‌‌‌ ప్రతినిధి అయతుల్లా అబ్దుల్‌‌‌‌‌‌‌‌ మజీద్‌‌‌‌‌‌‌‌ హకీమ్‌‌‌‌‌‌‌‌ ఇలాహి మాట్లాడుతూ.. మినాబ్‌‌‌‌‌‌‌‌ స్కూల్​దాడిపై అమెరికా ఇప్పటివరకు క్షమాపణ చెప్పలేదన్నారు. కొంతమంది చిన్నారుల మృతదేహాలు ఇంకా లభించలేదని, వారి తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించలేక ఆవేదన చెందుతున్నారని చెప్పారు.