మరోసారి బాలయ్యతో విద్యాబాలన్..

మరోసారి బాలయ్యతో విద్యాబాలన్..

ఇటీవల రజినీకాంత్ సినిమా ‘జైలర్‌‌‌‌ 2’లో స్టైలిష్‌‌ విలన్‌‌గా ఆకట్టుకున్నారు విద్యాబాలన్. కాంత అనే నెగెటివ్ క్యారెక్టర్‌‌‌‌లో తన నటనకు ప్రశంసలు లభించాయి. తాజాగా ఆమె మరో సౌత్ ఇండియన్‌‌ సినిమాలో నటించబోతోందని తెలుస్తోంది. అదికూడా తెలుగు సినిమాలో కావడం విశేషం. బాలకృష్ణ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో సుధాక‌‌ర్ మిక్కిలినేని నిర్మిస్తున్న చిత్రం కోసం విద్యాబాలన్‌‌ను సంప్రదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇందులో మరో హీరోయిన్‌‌ కూడా ఉన్నప్పటికీ విద్యాబాలన్‌‌ మెయిన్‌‌ లీడ్‌‌గా కనిపించనుందట.  సెకండాఫ్‌‌ ఫ్లాష్‌‌ బ్యాక్‌‌ సీన్స్‌‌లో వచ్చే ఆమె క్యారెక్టర్‌‌‌‌ కథాగమనాన్ని మలుపుతిప్పే అత్యంత కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే అధికారికంగా ప్రారంభమైన ఈ చిత్రం, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌‌కు వెళ్లనుంది. విద్యాబాలన్‌‌ ఎంపిక నిజమైతే, బాలకృష్ణతో ఆమెకు ఇది రెండో సినిమా కానుంది.  గతంలో ఎన్టీఆర్‌‌‌‌ బయోపిక్‌‌గా వచ్చిన కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో బాలకృష్ణకు జంటగా విద్యాబాలన్‌‌ నటించిన విషయం తెలిసిందే. మ‌‌రోసారి వీళ్లిద్దరూ క‌‌లిసి నటించబోతుండడంతో ఎన్‌‌బీకే 112పై ఆసక్తి పెరిగింది.