విహాన్ కార్తీక్ హీరోగా ఎం.జే.నాయుడు దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘కెరూబ్’. గత, వర్తమాన, భవిష్యత్తు అనేవి ట్యాగ్‌లైన్స్. నవంబర్ 20న సినిమా విడుదల. సోమవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. అతిథిగా హాజరైన డైరెక్టర్ సముద్ర మాట్లాడుతూ ‘ట్రైలర్ చూడగానే మన ఫారెస్ట్‌లో చేసిన అవతార్‌లాగా అనిపించింది. మన తెలంగాణలో ఇంత అందమైన అడవులున్నాయా అనిపించింది. రామాయణం అంత హిట్ కావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
ఈ సందర్భంగా హీరో విహాన్ కార్తీక్ మాట్లాడుతూ ఇందులో లీడ్‌గా నటించడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. దర్శక నిర్మాత ఎం.జే.నాయుడు మాట్లాడుతూ ‘కథంతా టైటిల్‌లోనే ఉండాలని అరబిక్ లాంగ్వేజ్ నుంచి ‘కెరూబ్’ అనే టైటిల్ ఎంచుకున్నాం. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచేలా ఉంటుంది’ అని అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు
