గ్రామీణ యువతి నుంచి ఆస్ట్రోనాట్ వరకు.. ఆసక్తి రేపుతున్న 'ఆకాశంలో ఒక తార'

గ్రామీణ యువతి నుంచి ఆస్ట్రోనాట్ వరకు.. ఆసక్తి రేపుతున్న 'ఆకాశంలో ఒక తార'

‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి” అని మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన  మాటలే స్ఫూర్తిగా ఓ పల్లెటూరి అమ్మాయి అంతరక్ష్యాన్ని ఎలా అందుకుంది అనేది ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంలో చూడమంటున్నారు దర్శకుడు పవన్ సాధినేని.  దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  సోమవారం మూవీ ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. చిన్నప్పటి నుంచి ఆస్ట్రోనాట్‌‌ కావాలని కలలు కనే కల్పన అనే అమ్మాయిగా సాత్విక కనిపించింది.  ఎవరెంత ఎగతాళి చేసినా పట్టించుకోకుండా తన లక్ష్యం వైపు ముందడుగు వేస్తున్న ఆమెకు అండగా నిలిచే  కృష్ణ అనే పాత్రలో దుల్కర్ కనిపించాడు.  

మరోవైపు, ఓ మిషన్ విఫలమవడంతో విమర్శలు ఎదుర్కొంటున్న ఏరోస్పేస్ ఇంజినీర్ రోహిణి (శ్రుతిహాసన్) రాకెట్‌‌ తయారు చేయడానికి సరైన టీమ్ కోసం వెతుకుతుంటుంది. ఆ టీమ్‌‌లో చేరిన కల్పన.. తన జీవిత కలను ఎలా నేర్చుకున్నది, ఈ ప్రయాణంలో ఎదురైన అవాంతరాలు ఏమిటనేది ప్రధాన కథ.  చిన్న చిన్న ఎక్స్‌‌ప్రెషన్స్‌‌తో ఎమోషనల్‌‌ సీన్స్‌‌లో దుల్కర్‌‌‌‌ నటన ఇంప్రెస్‌‌ చేసింది.  ‘పదిమంది నవ్వితే ఏంటి.. ఒక్కళ్లు నమ్మితే చాలుగా కృష్ణగారు’ లాంటి డైలాగ్స్‌‌ ట్రైలర్‌‌‌‌కు హైలైట్‌‌గా నిలిచాయి. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మించారు. నవంబర్ 20న సినిమా విడుదల కానుంది.