కరీంనగర్, వెలుగు: నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను గతంలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే క్రమబద్ధీకరించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సమ్మె కాలంలో నిలిపివేసిన వేతనాలను పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యోగుల పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగ సంఘం జేఏసీ అధ్యక్షుడు రమేశ్ ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు కరీంనగర్‌లో బండి సంజయ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యోగులకు మద్దతుగా బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.
