హైదరాబాద్, వెలుగు: ఎయిర్‌టెల్ తన కస్టమర్ల కోసం కొత్త రివార్డులు, ప్రత్యేక డిస్కౌంట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ ఇన్‌సైడర్ ప్లాట్‌ఫామ్ ద్వారా షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, లెర్నింగ్, హెల్త్ కేటగిరీల్లో రూ.30 వేలకు పైగా విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. డ్యుయోలింగో, క్రోమా, పాకెట్ ఎఫ్ఎం, సినీపోలిస్, అపోలో 24/7 సంస్థలతో కలిసి ఈ ఆఫర్లను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రూ.3,120 విలువైన 12 నెలల సూపర్ డ్యుయోలింగో సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
కొన్ని ఐఫోన్ 15, 16, 17 మోడళ్లపై క్రోమా, యాపిల్ ద్వారా గరిష్ఠంగా రూ.23,000 వరకు తగ్గింపు పొందవచ్చు. పాకెట్ ఎఫ్ఎం ప్రీమియం సేవలు 3 నెలలు ఉచితం. సినీపోలిస్‌లో 2 టికెట్లు కొంటే 1 టికెట్ ఉచితం. ఈ ఆఫర్‌పై గరిష్ఠంగా రూ.150 డిస్కౌంట్ ఉంటుంది. ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు రూ.1,500 ఫుడ్ ఆర్డర్‌పై రూ.300 తగ్గింపు కూడా ఉంది. అపోలో సర్కిల్ మెంబర్‌షిప్‌ను 6 నెలలు ఉచితం.
