హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను యథావిధిగా సాంకేతిక విద్యాశాఖలోనే కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో157ను టీపీ జేఏసీ స్వాగతించింది. జూన్ 16న జారీ చేసిన జీవో 97 ద్వారా పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ వర్సిటీలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ 35 రోజులపాటు ఆందోళనలు చేసినట్టు గుర్తుచేసింది. సోమవారం మాసాబ్‌ట్యాంక్‌లోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో టీపీ జేఏసీ చైర్మన్ ఎం.నాగరాజు, జనరల్ సెక్రటరీ శ్రావణ్ కుమార్ మాట్లాడారు.
పాలిటెక్నిక్ వ్యవస్థను మెరుగుపర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం అద్భుతమని, విద్యార్థుల తరఫున సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. హైలెవల్ కమిటీకి సారథ్యం వహించిన సలహాదారు కె. కేశవరావు ప్రభుత్వాన్ని ఒప్పించారని గుర్తుచేశారు. కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ కోదండరాంతోపాటు ఆఫీసర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో టీపీజేఏసీ అడ్వైజర్ కె.చంద్రశేఖర్, పి.ఆనంద్, శ్రీరామ్, విష్ణు, ఎం.రాజ్‌కుమార్, బి.నీరజ, అభినవ్, మసూద్, సునీత, సౌజన్య పాల్గొన్నారు. .
