నిర్మాణ రంగానికి ప్రత్యేక పైప్‌‌ లైన్లు : జలమండలి ఎండీ అశోక్ రెడ్డి

నిర్మాణ రంగానికి ప్రత్యేక పైప్‌‌ లైన్లు : జలమండలి ఎండీ అశోక్ రెడ్డి

హైదరాబాద్ సిటీ, వెలుగు: నిర్మాణ రంగానికి ప్రత్యేక పైప్‌‌లైన్ల ద్వారా ఎస్టీపీ నీటిని అందించే అంశంపై ప్లాన్ చేస్తున్నామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అన్నారు. సోమవారం నాగోల్, పటేల్ చెరువు ఎస్టీపీలను సందర్శించి శుద్ధి ప్రక్రియ, గ్రీన్ వాటర్ ట్యాంకర్ల నిర్వహణను పరిశీలించారు. నాగోల్ ఎస్టీపీ వద్ద అందుబాటులో ఉన్న శుద్ధి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు అవసరమైన ఇంజినీరింగ్, విద్యుత్, నిర్వహణ వ్యయాలపై నివేదిక రూపొందించాలని సూచించారు.

వాటర్ ట్యాంకర్ల సరఫరాను పెంచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పటేల్ చెరువు ఎస్టీపీ వద్ద స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి గ్రీన్ వాటర్ ట్యాంకర్లను ప్రారంభించారు. నిర్మాణ సంస్థలు శుద్ధి చేసిన నీటిని వినియోగించుకోవాలని కోరారు. నిర్వాణ హోమ్‌‌స్పేసెస్ నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించి, భారీ నిర్మాణ ప్రాజెక్టులకు ఎస్టీపీల నుంచి 400 మీటర్ల మేర పైప్‌‌లైన్లు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.