యూట్యూబర్ను లిప్ కిస్ అడిగిన ఆకతాయి అరెస్టు.. చెవులు పట్టుకుని క్షమాపణ

యూట్యూబర్ను లిప్ కిస్ అడిగిన ఆకతాయి అరెస్టు.. చెవులు పట్టుకుని క్షమాపణ

విదేశీయులతో ఎలా పడితే అలా వ్యవహరించవచ్చు.. వాళ్లు టేకిటీజీగా తీసుకుంటారు అనే మనస్తత్వం ఉన్నవాళ్లకు ఈ కేసు చెంపదెబ్బ లాంటిది. ఇండియాకు వచ్చిన అతిథులు, అందులో యూట్యూబర్ ను లిప్ కిస్ ఇవ్వాలని వేధించిన ఆకతాయిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల ట్రీట్ మెంట్ తర్వాత.. తన ప్రవర్తనకు తాను సిగ్గుపడుతున్నట్లు వీడియో రిలీజ్ చేశాడు ఆ ఆతకాయి.

వివరాల్లోకి వెళ్తే.. థాయ్-ఫ్రెంచ్ యూట్యూబర్ ఐఆర్ఎల్  స్ట్రీమర్ జస్ట్ కెత్ లైవ్‌స్ట్రీమ్‌లో భాగంగా ఇండియాకు వచ్చారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో లౌవ్ స్ట్రీమ్ చేశారు. ఈ సందర్భంగా ఆమెతో అసభ్యంగా అసభ్యంగా ప్రవర్తించాడు ఒక తుంటరి యువకుడు. సెల్ఫీ ఇవ్వవా.. లిప్ కిస్ ఇవ్వవా అంటూ వేధించాడు. ఆమె దీనికి సున్నితంగా తిరస్కరించింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెల్లింది. 

ఆకతాయి పేరు అఫ్తాబ్ గా గుర్తించిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల ట్రీట్ మెంట్ తర్వాత.. ఒక గెస్టుతో అలా ప్రవర్తించినందుకు సిగ్గుపడుతున్నానని.. క్షమాపణ చెబుతూ  వీడియో విడుదల చేశాడు. తను అరెస్ట్ అయినట్లు అతనే ధృవీకరించాడు. చెవులు పట్టుకుని మాట్లాడుతూ, మళ్ళీ ఇలాంటి పని చేయనని చెప్పాడు.

నా పేరు అఫ్తాబ్, నాన్న పేరు అబ్రార్ ఖాన్. నేను పటాన్ తహసీల్‌లోని కాళీ ముర్తి నివాసిని. కొన్ని నెలల క్రితం నేను పొరపాటు చేశాను. దాని వల్ల సూరజ్‌పోల్ పోలీసులు కేసు నమోదు చేసి నన్ను అరెస్ట్ చేశారు. నేను చేసిన పనికి చాలా సిగ్గుపడుతున్నాను. బయటి నుంచి వచ్చిన అతిథులను, మహిళలను గౌరవంగా చూసుకోవాలి అంటూ అఫ్తాబ్ వేడుకున్నాడు. తనలాగా ఎవరూ ప్రవర్తించొద్దని కూడా అభ్యర్థించాడు.

ఈ ఘటన జరిగి నెల గ డుస్తోంది.  JustKeth ఉదయపూర్‌లో రాత్రిపూట బయట నడుస్తూ లైవ్‌స్ట్రీమ్ చేస్తున్న సమయంలో అఫ్తాబ్ ఆమె దగ్గరకు వచ్చాడు. సెల్ఫీ అడగడానికి బదులు, ఆమెను 'లిప్ కిస్' అడిగాడని వైరల్ ఫుటేజీలో కనిపించింది. అతని డిమాండ్‌ను ఆమె నేరుగా లైవ్‌లోనే తిరస్కరించింది.

ఆ ఇంటరాక్షన్ లైవ్‌లోనే రికార్డ్ అయింది. JustKeth తర్వాత దాన్ని తన Instagram, YouTube ఛానెళ్ళలో షేర్ చేసింది. వీడియో షేర్ అవడంతో, అఫ్తాబ్ ప్రవర్తనపై అనేక మంది తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే విదేశీ మహిళలకు భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by justketh (@justketh_irl)