బంగ్లాదేశ్ అల్లర్లు లండన్ వరకు చేరుకున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, మద్ధతు దారులు లండన్ వీధులలో పొట్టుపొట్టుగా కొట్టుకున్న వీడియో వైరల్ గా మారింది. లండన్‌లోని రోమ్‌ఫోర్డ్‌లో 2026 నవంబర్ 16 ( సోమవారం) రాత్రి అవామీ లీగ్, NCP మద్ధతు దారుల మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మక ఘటనలకు దారితీసింది.
బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) చీఫ్ నహీద్ ఇస్లామ్‌కు నిర్వహించిన రిసెప్షన్ దగ్గర హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో కనీసం 4 నుంచి 5 మంది గాయపడ్డారని ఢాకా ట్రిబ్యూన్, ప్రోతోమ్ ఆలో వర్తమాన పత్రికలు తెలిపాయి.
మేఫెయిర్ హాల్ దగ్గర నవంబర్ 16 రాత్రి బ్రిటీష్-బంగ్లాదేశీ కమ్యూనిటీ నహీద్ ఇస్లామ్‌కు రిసెప్షన్ నిర్వహించింది. కార్యక్రమం జరుగుతున్నప్పుడే అవామీ లీగ్ కార్యకర్తలు వేదిక వెలుపల గుమిగూడారు. అతిథులపై గుడ్లు, నీటి సీసాలు విసిరారని ప్రత్యక్ష సాక్షులు, నిర్వాహకులు చెప్పారు.
కార్యక్రమం ముగిసిన తర్వాత పరిస్థితి మరింత తీవ్రమైంది. హాల్ వెనుక రోడ్డుపై ఇరు వర్గాలు తరుముకుంటూ చివరికి తీవ్రంగా భిడించాయి. దాదాపు 20 నిమిషాల పాటు ఘర్షణ కొనసాగిందని ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది. లండన్ పోలీసులు జోక్యం చేసుకుని లాఠీ చార్జీలతో గుంపులను చెదరగొట్టారు. గాయపడినవారిలో కొందరిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ప్రోతోమ్ ఆలో ప్రకారం 5 మంది కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌లో చేర్పించారు.
Clashes erupted between Awami League and NCP supporters in East London following a civic reception for Nahid Islam. Reports say four people suffered head injuries during the confrontation, prompting police intervention. #London #NahidIslam #BangladeshPolitics #AwamiLeague #NCP #jpdigital
— Jehan Pakistan Digital (@JPDigitalPak) November 17, 2026
నహీద్ ఇస్లామ్ నేరుగా ఘర్షణలో పాల్గొనలేదు. ఆయన రిసెప్షన్ ప్రారంభానికి మూడు గంటల ముందే హాల్‌లోకి వెళ్లారని, ముందు వైపు నిరసనకారులు గుమిగూడినప్పుడు వెనుక దారి నుంచి బయటకు వెళ్లారని ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది.
మంగళవారం ఫేస్‌బుక్‌లో ప్రకటన చేస్తూ నహీద్.. ఈ దాడి పిరికి చర్య అని విమర్శించారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల ప్రతినిధులు, జర్నలిస్టులు ఈ హింసను ప్రత్యక్షంగా చూశారని పేర్కొన్నారు. గాయపడినవారికి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నామని చెప్పారు. అవామీ లీగ్‌ను ఫాసిస్ట్ రాజకీయ శక్తిగా అభివర్ణిస్తూ, విదేశాల్లో కూడా హింస, భయబ్రాంతుల ద్వారా అభిప్రాయ వ్యక్తీకరణను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సత్వర, నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని బ్రిటీష్ ప్రభుత్వాన్ని కోరారు.
ఇది తొలి సంఘటన కాదు. నవంబర్ 14న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో అవామీ లీగ్ సమర్థకులు నహీద్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఆ సందర్భంలో NCP సమర్థకులు జోక్యం చేసుకున్నందున పెద్ద ఘర్షణ జరగలేదని ప్రోతోమ్ ఆలో తెలిపింది. జూన్‌లో NCP నేత హస్నత్ అబ్దుల్లా ఈస్ట్ లండన్ సందర్శనలోనూ అవామీ లీగ్ నిరసనకారులు గుడ్లు విసిరిన ఘటన నమోదైంది.
ALSO READ : అమెరికాలో డర్టీ బాంబ్ దాడికి ఇరాన్ ప్లాన్.. ట్రంప్ ప్రభుత్వ అధికారులే టార్గెట్..!
బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ దేశాలలో కూడా పార్టీల మద్ధతు దారులు ఘర్షణలు పాల్పడుతున్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తున్నట్లు ప్రకటించిన తర్వాత పరిస్థితులు మరింత వేడెక్కుతున్నాయి. హసీనా ఆగస్ట్ 2024 నుంచి భారత్‌లో ఉన్నారు. ఆమె న్యాయవాదులు పాస్‌పోర్ట్, గుర్తింపు పత్రాల కోసం ఢాకాను సంప్రదించారు. ఆదివారం హసీనా స్వగ్రామం ఉన్న గోపాల్‌గంజ్ జిల్లాలో వందల మంది అవామీ లీగ్ మద్ధతుదారులు వేలాడే ఆయుధాలతో రోడ్లపైకి వచ్చారని, పోలీసులతో ఘర్షణకు దిగారని.. బీఎన్పీ-లింక్డ్ ఆస్తులకు నిప్పుపెట్టారని స్థానిక మీడియా వెల్లడించింది.
