వేలంలోకి రూ.47.45 కోట్ల పర్స్‌తో లక్నో.. రిటైన్డ్, రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే!

వేలంలోకి రూ.47.45 కోట్ల పర్స్‌తో లక్నో.. రిటైన్డ్, రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే!

లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఫ్రాంచైజీ సంచలన నిర్ణయాలతో కూడిన రిటెన్షన్, రిలీజ్ జాబితాను విడుదల చేసింది. జట్టులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టిన లక్నో.. స్టార్ పేసర్లు అవేష్ ఖాన్, ఆన్రిచ్ నోర్ట్జే, స్టార్ స్పిన్నర్ వానిందు హసరంగా సహా ఏడుగురు ఆటగాళ్లను వదులుకుంది. అంతేకాదు, రిషబ్ పంత్ పాటు మహ్మద్ షమీ, ఎం.సిద్ధార్థ్‌లను కూడా ఇతర ఫ్రాంచైజీలకు ట్రేడ్ చేడంతో క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కానీ, ఈ ట్రేడ్ డీల్స్ ద్వారా కుల్దీప్ యాదవ్, సామ్ కరన్‌లను సొంతం చేసుకున్న లక్నో.. నికోలస్ పూరన్, ఐడెన్ మార్కరమ్, జోష్ ఇంగ్లిస్, అబ్దుల్ సమద్‌లతో కూడిన బలమైన కోర్ గ్రూప్‌ను అట్టిపెట్టుకుంది.

ఆ ఆటగాళ్లకు ఉద్వాసన (Released Players): 

* ఐపీఎల్ 2027 సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ మొత్తం ఏడుగురు ఆటగాళ్లను విడుదల చేసింది. 

* సీనియర్ పేసర్ అవేష్ ఖాన్, సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఆన్రిచ్ నోర్ట్జే, శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ వానిందు హసరంగా లక్నో రిలీజ్ లిస్టులో ప్రధానంగా ఉన్నారు. వీరితో పాటు హిమ్మత్ సింగ్, మాథ్యూ బ్రీట్జ్‌కే, నమన్ తివారీ, జార్జ్ లీండేలను కూడా ఫ్రాంచైజీ వదులుకుంది.

భారీ పర్సుతో వేలంలోకి లక్నో: 

* భారీ ధరకు కొనుగోలు చేసిన ఆటగాళ్లను విడుదల చేయడంతో లక్నో సూపర్ జెయింట్స్ ఖజానా కళకళలాడుతోంది. 

* అతిపెద్ద పర్స్: డిసెంబర్ 16న గోవాలో జరిగే ఐపీఎల్ 2027 మినీ వేలంలో అన్ని టీమ్స్‌కంటే అత్యధికంగా రూ.47.45 కోట్ల భారీ పర్స్ బ్యాలెన్స్ లక్నో వద్ద ఉంది.

* స్లాట్లు: వేలంలో LSG గరిష్టంగా 7 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉండగా, ఇందులో 3 విదేశీ ఆటగాళ్ల (Overseas) స్లాట్లు ఖాళీగా ఉన్నాయి.

రిటైన్ ఆటగాళ్లు: అబ్దుల్ సమద్, దిగ్వేష్ రాఠీ, నికోలస్ పూరన్, ఐడెన్ మార్కరమ్, జోష్ ఇంగ్లిస్, ప్రిన్స్ యాదవ్, ఆకాష్ సింగ్, కుల్దీప్ యాదవ్, సామ్ కరన్, అక్షత్ రఘువంశీ, మయాంక్ యాదవ్, షాబాజ్ అహ్మద్, అర్జున్ టెండూల్కర్, మిచెల్ మార్ష్, అర్షిన్ కులకర్ణి, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి 

రిలీజ్ ప్లేయర్స్: అవేష్ ఖాన్, ఆన్రిచ్ నోర్ట్జే, వానిందు హసరంగా, హిమ్మత్ సింగ్, మాథ్యూ బ్రీట్జ్‌కే, నమన్ తివారీ, జార్జ్ లీండే (ట్రేడ్ ద్వారా పంత్, షమీ, సిద్ధార్థ్)