హెట్మెయర్, కుల్దీప్ ఔట్.. రాజస్థాన్ రాయల్స్ రిటైన్డ్, రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే!

హెట్మెయర్, కుల్దీప్ ఔట్.. రాజస్థాన్ రాయల్స్ రిటైన్డ్, రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే!

జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ (RR) ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది. 2022 సీజన్ నుంచి జట్టులో కీలక ఫినిషర్‌గా కొనసాగి, గత మెగా వేలానికి ముందు దిగ్గజ ఆటగాడు జోస్ బట్లర్‌ను కాదని మరీ రూ.11 కోట్లకు రిటైన్ చేసుకున్న వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ షిమ్రాన్ హెట్మెయర్‌కు (Shimron Hetmyer) రాజస్థాన్ యాజమాన్యం గుడ్‌బై చెప్పేసింది. మిట్టల్ కుటుంబం నేతృత్వంలోని కన్సార్టియం $1.65 బిలియన్లకు (సుమారు రూ.15,660 కోట్లు) ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన తర్వాత ఆడబోతున్న తొలి సీజన్ కావడంతో యాజమాన్యం జట్టులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. మరోవైపు ట్రేడ్ వార్తల నడుమ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్తో పాటు స్పిన్నర్ రవి బిష్ణోయిని జట్టు అట్టిపెట్టుకుంది.

కొత్త యజమాన్యం మాస్టర్ ప్లాన్.. జట్టులోకి షమీ:

* ఐపీఎల్ 2027 వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ ఈరోజు (2026, నవంబర్ 17, మంగళవారం) తమ రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాను అధికారికంగా ప్రకటించింది. 

* రిటెన్షన్లు: ట్రేడ్ డీల్ వార్తల నడుమ యశస్వి జైస్వాల్‌ను అట్టిపెట్టుకున్న రాజస్థాన్.. కెప్టెన్ రియాన్ పరాగ్, వైభవ్ సూర్యవంశీ, సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్, ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్లను కీలక కోర్ గ్రూప్‌గా కొనసాగించింది.

* ట్రేడ్ ద్వారా ఇద్దరు కొత్త ప్లేయర్స్: లక్నో సూపర్ జెయింట్స్ (LSG) నుంచి స్టార్ పేసర్ మహ్మద్ షమీ (రూ.8 కోట్లు), లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎం. సిద్ధార్థ్ (రూ.75 లక్షలు) ట్రేడ్ డీల్ ద్వారా రాజస్థాన్ గూటికి చేరారు. మరోవైపు ఆల్‌రౌండర్ సామ్ కరన్ (రూ.2.4 కోట్లు) లక్నో జట్టుకు వెళ్లిపోయాడు. 

రిలీజ్ చేసిన ఆటగాళ్లు: షిమ్రాన్ హెట్మెయర్ (రూ.11 కోట్లు), తుషార్ దేశ్‌పాండే (రూ.6.5 కోట్లు), ఆడమ్ మిల్నే (రూ.2.4 కోట్లు), క్వేనా మఫాకా (రూ.1.5 కోట్లు), కుల్దీప్ సేన్ (రూ.75 లక్షలు), యుధ్వీర్ సింగ్ (రూ.35 లక్షలు), విఘ్నేష్ పుతూర్ (రూ.30 లక్షలు), రవి సింగ్

గోవా వేలంలోకి రూ.27.05 కోట్ల పర్స్‌తో రాజస్థాన్: 

* భారీ ధర పలికిన ఆటగాళ్లను వదులుకోవడంతో రాజస్థాన్ రాయల్స్ పర్స్ బ్యాలెన్స్ బాగా పెరిగింది. 

* పర్స్ బ్యాలెన్స్, స్లాట్లు: డిసెంబర్ 16న గోవాలో జరిగే వేలంలో 2008 ఛాంపియన్స్ దగ్గర రూ.27.05 కోట్లు ఉన్నాయి. 

* వేలంలో రాజస్థాన్ గరిష్టంగా 6 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది (ఇందులో కేవలం విదేశీ ఆటగాళ్ల స్లాట్లు మాత్రమే మిగిలి ఉంది).