కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ కుమార్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'డేర్ డెవిల్'లో మరో సెన్సేషనల్ స్టార్ చేరిపోయారు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించబోతున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమాకు శివన్న ఎంట్రీతో మరింత క్రేజ్ పెరిగింది. అజిత్, శివరాజ్‌కుమార్ మధ్య వచ్చే సన్నివేశాలు వెండితెరపై ఏ రేంజ్‌లో ఉంటాయోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. అజిత్ వ్యక్తిగత మేనేజర్ సురేష్ చంద్ర ఈ విషయాన్ని ధృవీకరించారు. సినిమాలో శివన్న సాధారణ విలన్‌లా కాకుండా, అనేక కోణాలున్న శక్తివంతమైన ప్రతినాయకుడిగా కనిపిస్తారని వెల్లడించారు. ఈ పాత్రను దృష్టిలో పెట్టుకునే శివరాజ్‌కుమార్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. అంతేకాదు, అజిత్‌కు శివన్న అంటే ఎంతో గౌరవమని, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. నవంబర్ 17 లేదా 18 నుంచి శివన్న షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం..
'గుడ్ బ్యాడ్ అగ్లీ' తర్వాత అజిత్, అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇప్పటికే నవంబర్ 2న ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రాత్రివేళల్లో కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల, ఉన్ని ముకుందన్, ప్రభు, పార్తిబన్, సునీల్, రెడిన్ కింగ్స్‌లీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అజిత్ భార్య షాలిని అజిత్‌కుమార్ తన బ్రేవ్‌హార్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. నిర్మాతగా షాలినికి ఇదే తొలి సినిమా. సినిమాటోగ్రఫీని అభినందన్ రామానుజం, ఎడిటింగ్‌ను విజయ్ వేలుకుట్టి నిర్వహిస్తున్నారు. మరి ఈ ' డేర్ డెవిల్' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి..
