హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ సంస్థలపై రెరా కొరడా...

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ సంస్థలపై రెరా కొరడా...

హైదరాబాద్ లోని పలు రియల్ ఎస్టేట్ సంస్థలపై తెలంగాణ రెరా కొరడా ఝుళిపించింది. నిబంధనలు ఉల్లంఘించిన పలు సంస్థలకు జరిమానా విధించింది రెరా. సనాలి ఐటీ పార్క్స్ సంస్థకు రూ.25 లక్షలు జరిమానా విధించింది రెరా. 30 రోజుల్లోగా జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. మంచిరేవులలోని సనాలి ది ఎడ్జ్ ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ లేకుండానే విక్రయాలు చేపట్టారని ఆరోపణలు ఉన్న క్రమంలో ఈమేరకు జరిమానా విధించింది రెరా.

రిజిస్ట్రేషన్ వచ్చే వరకు ప్రకటనలు, బుకింగ్‌లు, విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించింది రేరా. అంతే కాకుండా.. శ్రీ ఆదిత్య స్క్వేర్స్ సంస్థకు కొనుగోలుదారు చెల్లించిన రూ.17 లక్షలు వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్ సంస్థ నుంచి రూ.41.85 లక్షలు వడ్డీతో సహా రీఫండ్ చేయాలని ఆదేశించింది రెరా.

వాసవి రియల్టర్స్ ఎల్ఎల్‌పీకి రూ.49.50 లక్షలపై 10.85 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలని.. 2025 ఫిబ్రవరి 7 నుంచి ఫ్లాట్ అప్పగించే వరకు వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసింది రెరా. ఎస్‌వీఎం ఆదిత్య హోమ్స్ సంస్థ నుంచి రూ.27.16 లక్షలు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని.. మియాపూర్ అరైన్ ఎమరాల్డ్‌లో ఫ్లాట్ నంబర్ 502ను వెంటనే అప్పగించాలని అరైన్ ఇన్‌ఫ్రాకు ఆదేశాలు జారీ చేసింది రెరా.  రూ.6.58 లక్షల బకాయిల పేరుతో ఫ్లాట్ అప్పగింత నిలిపివేయడంపై రెరా అభ్యంతరం వ్యక్తం చేసింది రెరా. ఈ ఆదేశాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది రెరా.