IPL 2027 Mega Trade: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 సీజన్‌కు ముందు ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల బదిలీలు (IPL 2027 Trade Window) జోరందుకున్నాయి. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య ముగ్గురు కీలక ఆటగాళ్లతో కూడిన ఒక భారీ ట్రేడ్ డీల్ అధికారికంగా కంప్లీట్ అయింది. ఈ ఒప్పందంలో భాగంగా ఇండియన్ స్టార్ పేసర్ మహ్మద్ షమీతో పాటు స్పిన్నర్ ఎం.సిద్ధార్థ్ రాజస్థాన్ జట్టులోకి వెళ్లగా.. ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ లో చేరాడు.
రాజస్థాన్ రాయల్స్‌లోకి మహ్మద్ షమీ:
* గత సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్‌లోకి ట్రేడ్ అయిన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, ఇప్పుడు తన మకాంను రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి మార్చాడు.
* వేతన కోత: ఈ ట్రేడ్ ఒప్పందంలో భాగంగా మహమ్మద్ షమీ తన వేతనంలో దాదాపు రూ.2 కోట్లు కోల్పోవాల్సి వచ్చింది. గతంలో రూ.10 కోట్ల ధర పలికిన షమీ.. ఇప్పుడు రాజస్థాన్ తరఫున రూ.8 కోట్ల ఫీజుతో ఆడనున్నాడు.
* ఐపీఎల్ రికార్డు: ఇప్పటి వరకు 132 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మహ్మద్ షమీ ఖాతాలో 145 వికెట్లు ఉన్నాయి. షమీ చేరికతో రాజస్థాన్ పేస్ అటాక్ మరింత స్ట్రాంగ్ కానుంది.
* ఈ ఒప్పందంలో భాగంగా తమిళనాడుకు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎం.సిద్ధార్థ్ తన ప్రస్తుత ధర రూ.75 లక్షలకే రాజస్థాన్ రాయల్స్ జట్టులో జాయిన్ అయ్యాడు.
ఒక్క మ్యాచ్ ఆడకుండానే రాజస్థాన్‌ను వీడిన సామ్ కరన్:
* ఈ ట్రేడ్ డీల్‌లో ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి వెళ్లాడు.
* అదృష్టానికే పరీక్ష: గత సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు ట్రేడ్ అయిన సామ్ కరన్.. దురదృష్టవశాత్తు గాయం కారణంగా గత సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే రాజస్థాన్ జట్టుకు దూరమయ్యాడు.
ALSO READ : ధోనీ లేకుండా సీఎస్కే లేదు..
* లక్నోకు సరికొత్త బలం: ఇప్పుడు రూ.2.4 కోట్ల ప్రస్తుత ధరకు లక్నో జట్టులోకి వెళ్లిన సామ్ కరన్.. ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటి వరకు 997 రన్స్ చేయడంతో పాటు 59 వికెట్లు తీసుకున్నాడు. రాబోయే సీజన్‌లో లక్నో మిడిలార్డర్‌కు, బౌలింగ్‌కు ఇతను పెద్ద ప్లస్ పాయింట్ కానున్నాడు.
Currently in 𝑳𝑨𝑳𝑨 𝑳𝑨𝑵𝑫 🔥 A new chapter in Pink for one of the finest to ever bowl fast for India. Khamma Ghani, Shami bhai! 💗 https://t.co/06GmAyOqkI
— Rajasthan Royals (@rajasthanroyals) November 17, 2026
Nawabon ke sheher mein, all-round brilliance ka swagat hai 😌❤️ https://t.co/yq9rlblnvU
— Lucknow Super Giants (@LucknowIPL) November 17, 2026
