తలా ఫర్ ఎ రీజన్: 5 ఐపీఎల్ టైటిల్స్, 10 ఫైనల్స్, 5,400+ పరుగులు.. ధోనీ రికార్డులివే!

తలా ఫర్ ఎ రీజన్: 5 ఐపీఎల్ టైటిల్స్, 10 ఫైనల్స్, 5,400+ పరుగులు.. ధోనీ రికార్డులివే!

MS Dhoni Records: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో దాదాపు రెండు దశాబ్దాల పాటు ముడిపడి ఉన్న అద్భుతమైన ఆటగాడి ప్రయాణానికి తెరపడింది. ఐపీఎల్ 2027 సీజన్ నుంచి ఎంఎస్ ధోనీ (MS Dhoni) మైదానంలో బ్యాట్ పట్టకుండా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు టీమ్ మెంటార్‌గా (Team Mentor) కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. 2008 తొలి సీజన్ నుంచి ఎల్లో ఆర్మీని ముందుండి నడిపించిన తలా ధోనీ.. ఆటగాడిగా వీడ్కోలు పలకడానికి ముందు ఐపీఎల్ చరిత్రలో చెరగని ముద్ర వేశాడు. ఆయన సృష్టించిన ఆల్-టైమ్ రికార్డుల పూర్తి వివరాలని ఇప్పుడు V6 వెలుగు వెబ్సైట్లో చూద్దాం.. 

5 ఐపీఎల్ టైటిల్స్, 10 ఫైనల్స్:

* మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ అసాధారణ ప్రదర్శిన చేసింది.
* ఛాంపియన్ ఇయర్స్: 2010, 2011, 2018, 2021, 2023 సంవత్సరాలలో CSKను విజేతగా నిలిపిన ధోనీ. 
* ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి 5 ఐపీఎల్ ట్రోఫీలు సాధించిన రికార్డు ధోనీ పేరిట ఉంది.
* అంతేకాకుండా, ధోనీ నాయకత్వంలో CSK ఏకంగా 10 సార్లు ఫైనల్స్ చేరడం, 12 సీజన్లలో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడం విశేషం.

ఐపీఎల్‌లో 5,400+ పరుగులు:

* టాక్టికల్ లీడర్‌షిప్‌తో పాటు ఐపీఎల్‌లో అత్యంత ప్రమాదకరమైన ఫినిషర్‌గా ఎంఎస్ ధోనీ రికార్డు నమోదు చేశాడు. 
* మొత్తం 278 మ్యాచ్‌లలో ఆడిన ధోనీ.. 38.30 సగటు, 138.20 స్ట్రైక్ రేట్‌తో 5,439 రన్స్ సాధించాడు (నాటౌట్ అత్యధిక స్కోరు 84).
* ఇందులో 24 అర్ధశతకాలు, 375 ఫోర్లు, 264 సిక్సర్లు ఉన్నాయి.
* 2013లో అత్యధికంగా 461 పరుగులు చేసిన ధోనీ.. 2018లో (455 రన్స్), 2019లో (416 పరుగులు) అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు.

ఐపీఎల్లోనే నెంబర్-1 వికెట్ కీపర్: 

* కీపింగ్ గ్లౌవ్స్‌తో ధోనీ చేసిన మాయాజలానికి సాటిలేరు. 
* ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్‌గా (158 క్యాచ్‌లు) ధోనీ.  
* అత్యధిక స్టంపింగ్‌లు చేసిన వికెట్ కీపర్‌గా (47 స్టంపింగ్‌లు) ఆల్-టైమ్ రికార్డు ధోనీ పేరిటే ఉంది.
* మొత్తం 205 డిస్మిసల్స్‌తో ధోనీ తన షార్ప్ రిఫ్లెక్సెస్ ఏంటో నిరూపించుకున్నాడు.

ALSO READ : 5 ఐపీఎల్ ట్రోఫీలు, 18 ఏళ్ల సుధీర్ఘ ప్రయాణం..

మెంటార్‌గా ఎంఎస్ ధోనీ:

2024 సీజన్‌కు ముందు రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన మహేంద్ర సింగ్ ధోనీ, 2025లో రుతురాజ్ గాయపడినప్పుడు తాత్కాలికంగా మళ్లీ జట్టును నడిపించాడు. ఇప్పుడు 2027 నుంచి పూర్తిగా టీమ్ మెంటార్‌గా మారి, డగౌట్ నుంచి యువ ఆటగాళ్లను తీర్చిదిద్దే బాధ్యతను చేపట్టబోతున్నాడు. ఫ్రాంచైజీ యజమాని ఎన్. శ్రీనివాసన్ పేర్కొన్నట్లుగా, 2008లో ధోనీని జట్టులోకి తీసుకోవడం తమ చరిత్రలోనే అత్యుత్తమ నిర్ణయం అని చేసి చూపించాడు మహీ భాయ్.