MS Dhoni CSK Journey: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో ఒక ఆటగాడు కేవలం ఫ్రాంచైజీకి ఆడటం వేరు.. ఆ ఫ్రాంచైజీకి గుండెచప్పుడుగా మారడం వేరు.. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ఎంఎస్ ధోనీ (MS Dhoni) మధ్య ఉన్న బంధం సరిగ్గా అలాంటిదే. 2008 ఆరంభ సీజన్ నుంచి 2026 వరకు కొనసాగిన ఈ 18 ఏళ్ల సుధీర్ఘ ప్రయాణంలో.. ధోనీ కేవలం ఒక కెప్టెన్ లేదా వికెట్ కీపర్ మాత్రమే కాదు: స్థిరత్వాన్ని ఒక కళగా మార్చి, లాయల్టీకి నిలువెత్తు రూపంగా నిలిచిన చెన్నై అసలు సిసలు గుర్తింపు.. ఇప్పుడు ఆటగాడిగా వీడ్కోలు పలికి టీమ్ మెంటార్ (Team Mentor) గా కొత్త బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో.. ధోనీ సృష్టించిన ఆ అద్భుత సామ్రాజ్యం, ఆయన చెరగని ముద్ర ఏంటో V6 వెలుగు వెబ్ సైట్ ప్రత్యేక కథనంలో చూద్దాం..
$1.5 మిలియన్ల ఆక్షన్ నుంచి.. 5 ఐపీఎల్ ట్రోఫీల వరకు:
2008లో జరిగిన తొలి ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (ChennaiSuperKings) ధోనీని $1.5 మిలియన్ల ( భారత కరెన్సీలో సుమారు 14 కోట్ల)కు కొనుగోలు చేయడంతో ఈ జర్నీ మొదలైంది. భారత్‌కు టీ20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్‌గా బరిలోకి దిగిన ధోనీ, క్షణాల వ్యవధిలోనే CSKలో కీలకంగా మారిపోయాడు.
మొదటి టైటిల్ (2010, 2011): 2010లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి తొలిసారి టైటిల్ గెలుచుకున్న చెన్నై, ఆ మరుసటి ఏడాదే (2011) కప్‌ను డిఫెండ్ చేసుకుని టోర్నమెంట్‌లో తిరుగులేని శక్తిగా అవతరించింది. సురేష్ రైనా, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, ఫాఫ్ డు ప్లెసిస్‌లను నడిపిస్తూ.. కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో కలిసి ధోనీ సృష్టించిన విధ్వంసం ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన అలయన్స్‌గా నిలిచింది.
కెప్టెన్ కూల్ వ్యూహాలు: ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ తలవంచని తత్వం, ఒత్తిడిని జయించే నైజం కారణంగానే అతనికి కెప్టెన్ కూల్ అనే పేరు వచ్చింది. విచిత్రమైన ఫీల్డ్ సెటప్‌లు, బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకెళ్లడం లాంటి సాహసోపేత నిర్ణయాలతో షార్టెస్ట్ ఫార్మాట్‌ను పూర్తిగా అవగతం చేసుకున్నాడు.
2 సంవత్సరాల నిషేధం.. 2018 రెడంప్షన్ అద్భుతం:
* ఈ ప్రయాణంలో కొన్ని తప్పుడు అడుగులు, సవాళ్లు కూడా ఎదురయ్యాయి. 2016, 2017 సంవత్సరాలలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై రెండేళ్ల నిషేధం విధించినప్పుడు ధోనీ పుణె జట్టు తరఫున ఆడినా, చెన్నైపై ఆయనకున్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ఆ తర్వాత 2018లో ఘనంగా రీఎంట్రీ ఇచ్చి, వయసు మళ్లిన ఆటగాళ్లతో కూడిన జట్టు (డాడీస్ ఆర్మీ) అంటూ ఎగతాళి చేసిన విమర్శకుల నోళ్లను మూయిస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి మూడో టైటిల్‌ను అందుకున్నాడు.
ఇక 2021, 2023 సంవత్సరాలలో మరో రెండు ట్రోఫీలను సాధించి, చెన్నై ఖాతాలో మొత్తం 5 ఐపీఎల్ టైటిల్స్ చేర్చాడు. రోహిత్ శర్మతో సమానంగా అత్యధిక సార్లు ఐపీఎల్ గెలిచిన కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ చరిత్ర సృష్టించాడు. 2023 ఫైనల్‌లో మోకాలి గాయంతో ఇబ్బంది పడుతూనే జట్టును గెలిపించి, జడేజాను ఆత్మీయంగా హత్తుకున్న క్షణం ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని గుండెల్లో నిలిచిపోయింది.
చెపాక్ మైదానంలో ధోనీ జపం:
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో పసుపు జెర్సీల సముద్రం మధ్య హోరెత్తే "ధోనీ.. ధోనీ" నినాదాలు కేవలం నినాదాలు కావు, అది ఒక భావోద్వేగం.. 2024లో రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి సరికొత్త తరానికి బాటలు వేసిన ధోనీ, 2025లో తాత్కాలికంగా మళ్లీ జట్టును ముందుండి నడిపించాడు. కానీ 2026 సీజన్ మొత్తం కండరాల గాయం (Calf Injury) కారణంగా మైదానానికి దూరంగా ఉన్నాడు.
ఎట్టకేలకు ఐపీఎల్ 2027 రిటెన్షన్‌కు ముందు ఆటగాడిగా తన ప్రయాణాన్ని ముగించి, CSK టీమ్ మెంటార్‌గా కొత్త బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. మైదానంలో బ్యాట్ పట్టకపోయినా, డగౌట్ నుంచి ఆయన అందించే వ్యూహాలు, తలా ఫిలాసఫీ ఎప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్‌కు పెద్ద ఆస్తి అనే చెప్పాల్సి ఉంది.
endrum thala 💛 #ForOurThala https://t.co/VRmPKS2yEe
— Chennai Super Kings (@ChennaiIPL) November 17, 2026
OFFICIAL ANNOUNCEMENT 🦁💛 A once-in-a-lifetime player. A new role. A bond that lasts forever 💛 Mahendra Singh Dhoni takes charge as the Team Mentor of Chennai Super Kings! Through countless victories, challenging times, and memories that will stay in our hearts forever, MS has been at the heart of our journey from the very beginning. From leading us to glory to guiding the next generation of Super Kings, Thala will always be a part of our identity. And Chennai will always be his home. Read more : https://t.co/YKsoHYE51A #WhistlePodu
— Chennai Super Kings (@ChennaiIPL) November 17, 2026
"𝐓𝐫𝐮𝐬𝐭 𝐢𝐬 𝐰𝐡𝐚𝐭 𝐦𝐚𝐝𝐞 𝐭𝐡𝐢𝐬 𝐣𝐨𝐮𝐫𝐧𝐞𝐲 𝐩𝐨𝐬𝐬𝐢𝐛𝐥𝐞." https://t.co/LA97JA5s9W
— Chennai Super Kings (@ChennaiIPL) November 17, 2026
