ఏపీ స్థానిక ఎన్నికల్లో భాగంగా 23 పట్టణ స్థానిక సంస్థలకు నామినేషన్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. నామినేషన్ల పర్వం రెండో రోజులో భాగంగా నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంగళవారం ( నవంబర్ 17 ) కావలి మున్సిపల్ ఆఫీసు దగ్గర వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది
కావలి మున్సిపాలిటీలో 6 ,18 వార్డులలో వైసిపి అభ్యర్థి మక్కే దుర్గ భవాని, మక్కే కిరణ్ నామినేషన్ల స్కూటీనీలో వివాదం చెలరేగింది.. నామినేషన్ అసంపూర్తిగా ఉండడంతో అబ్జెక్షన్ పెట్టారు కూటమి అభ్యర్థి జనిగర్ల మహీంద్రా. ఈ క్రమంలో మున్సిపల్ ఆఫీసు దగ్గరికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.
కూటమి మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్ తో కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న ఎంఏ దగ్గుమతి వెంకటకృష్ణారెడ్డి మున్సిపల్ ఆఫీసు దగ్గరికి చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
రౌడీ షీటర్లను బైండోవర్ చేయడంలో పోలీస్ శాఖ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. ఎన్నికలవేళ రౌడీషీటర్లను ఎందుకు బైండ్ ఓవర్ చేసుకోలేదంటూ డీఎస్పీని ప్రశ్నించారు ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి
