హైదరాబాద్ లో స్వీట్ షాపులు ఇంత ఘోరమా..? ఇలాంటి స్వీట్స్ తిన్నామంటే కిడ్నీలు ఖతమే..!

హైదరాబాద్ లో స్వీట్ షాపులు ఇంత ఘోరమా..? ఇలాంటి స్వీట్స్ తిన్నామంటే కిడ్నీలు ఖతమే..!

హైదరాబాద్ లో ఆహార కల్తీ గురించి ఇటీవల వస్తున్న వార్తలు వింటుంటే.. వెన్నులో వణుకు పుడుతోంది. రోడ్డు పక్కన దొరికే తిండి మొదలుకొని పేరు మోసిన బడా హోటళ్ల వరకు ప్రతి చోటా బయటపడుతున్న కల్తీ బాగోతం హైదరాబాదీలకు భయం పుట్టిస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ లోని స్వీట్ షాపులలో కల్తీ బాగోతం బయటపడింది. మంగళవారం ( నవంబర్ 17 ) హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

హైదరాబాద్ లోని పలు స్వీట్ షాపుల్లో సిల్వర్ కాయిల్ స్థానంలో అల్యూమినియం ఫ్లేక్స్ ఉపయోగించడం చూసి అధికారులు సైతం షాక్ అయ్యారు. అసలైన సిల్వర్ కాయిల్ స్థానంలో అల్యూమినియం ఫ్లేక్స్ వినియోగిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. పాన్‌ చట్నీతో పాటు ఇతర ఆహార ఉత్పత్తుల్లోనూ అల్యూమినియం ఫ్లేక్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు అధికారులు.

ఈ తనిఖీల్లో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. భారీ మొత్తంలో అల్యూమినియం వరకాలు, ఫ్లేక్స్ ఇతర వస్తువులు స్వాధీనం  చేసుకున్నామని.. ఆహార పదార్థాల తయారీలో నిబంధనలకు విరుద్ధంగా అల్యూమినియం వినియోగిస్తున్నారని తెలిపారు అధికారులు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ వ్యాపారులపై కఠిన  చర్యలు తీసుకుంటామని తీలిపారుఅధికారులు.