ధోనీ లేకుండా సీఎస్కే లేదు.. చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ స్పెషల్ పోస్ట్.. ఫ్యాన్స్ కళ్లలో నీళ్లు!

ధోనీ లేకుండా సీఎస్కే లేదు.. చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ స్పెషల్ పోస్ట్.. ఫ్యాన్స్ కళ్లలో నీళ్లు!

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో ఎవరూ పరిణామం చోటు చేసుకుంది. కోట్లాది మంది అభిమానుల గుండెకాయ అయిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దిగ్గజం ఎంఎస్ ధోనీ (MS Dhoni) తన 18 ఏళ్ల ఐపీఎల్ ఆటగాడి ప్రయాణానికి అధికారికంగా గుడ్‌బై చెప్పేశాడు. ఐపీఎల్ 2027 రిటెన్షన్ జాబితా గడువుకు కొన్ని గంటల ముందే ఫ్రాంచైజీ ఈ సంచలన వార్తను వెల్లడించింది. మైదానంలో ఎల్లో జెర్సీ ధరించి బ్యాట్ పట్టే ఆ అద్భుత దృశ్యం ఇకపై కనిపించదని తెలిసి ఫ్యాన్స్ తీవ్ర ఆవేదనతో కంటతడి పెట్టిస్తున్నారు. కానీ, ఆటగాడిగా తప్పుకున్న ధోనీ.. ఇకపై CSK జట్టుకు టీమ్ మెంటార్‌గా (Team Mentor) కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడని చెన్నై యాజమాన్యం ప్రకటించింది.

ధోనీ లేని సీఎస్‌కే లేదు: ఎన్. శ్రీనివాసన్ భావోద్వేగ ప్రకటన

* చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్. శ్రీనివాసన్ ధోనీ రిటైర్మెంట్, మెంటార్ నియామకంపై స్పందిస్తూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ధోనీతో తనకున్న రెండు దశాబ్దాల బంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ధోనీ లేని సీఎస్‌కే లేదు.. గత రెండు దశాబ్దాలుగా మేం విజయాలు, అపజయాలు అన్నింటిలోనూ కలిసి ప్రయాణించాం.. మా మధ్య ఉన్న నమ్మకమే ఈ ప్రయాణాన్ని సాధ్యం చేసింది. 

* 2008లో నేను ధోనీని సీఎస్‌కేలోకి తీసుకోవాలని పట్టుబట్టాను.. నా జీవితంలో నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం అదే.. ఆయన సాధించిన ట్రోఫీలు మాత్రమే కాదు, ఆయనో గొప్ప మనిషి కాబట్టే అది గొప్ప నిర్ణయమైంది. ధోనీ ఎప్పటికీ మా గుర్తింపులో భాగమే, ఇది ఎప్పటికీ ఆయన ఇల్లేనని శ్రీనివాసన్ పేర్కొన్నారు.

జీవితకాలంలో ఒక్కసారే వచ్చే ఆటగాడు: రూపా గురునాథ్

CSK సహ యజమాని రూపా గురునాథ్ ధోనీ సేవలను కొనియూడుతూ.. ఆయన ఫ్రాంచైజీకి మూలస్తంభం అని అభివర్ణించింది. ఎంఎస్ ధోనీ లాంటి ఆటగాడు జీవితకాలంలో ఒక్కసారే వస్తాడు. 2008 ఆరంభం నుంచి ఆయన మా జట్టుతో ఉండటం మా అదృష్టం.. మైదానంలోనూ, బయటా మహీ చూపించిన నాయకత్వం, ప్రవర్తన ఎంతో ప్రత్యేకమైనవి.. రాబోయే రోజుల్లో యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో మెంటార్‌గా ఆయన అనుభవం జట్టుకు అమూల్యమైనదని తెలిపారు.

ALSO READ : తలా ఫర్ ఎ రీజన్: 5 ఐపీఎల్ టైటిల్స్, 10 ఫైనల్స్, 5,400+ పరుగులు.. ధోనీ రికార్డులివే!

చెన్నై నగరం ఆయన్ని సొంతం చేసుకుంది: కేఎస్ విశ్వనాథన్

చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఎండీ కేఎస్ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ధోనీకి చెన్నై నగరంతో ఉన్న విడదీయరాని అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.. ధోనీ క్రికెటర్‌గా సాధించిన రికార్డులు అందరికీ తెలుసు.. కానీ ధోనీని ప్రత్యేకంగా మార్చింది ఏమిటంటే.. ఆయన చెన్నై నగరంలో పూర్తిగా భాగమైపోయారు. నగరం ఆయన్ని, ఆయన నయగరాన్ని సొంతం చేసుకుంది. మైదానంలో ఎల్లో జెర్సీలో ఆయనను ఇకపై మిస్ అవుతాం.. కానీ డగౌట్ నుంచి ఆయన మార్గనిర్దేశం చేయడం మాకు ఎంతో సంతోషాన్నిస్తోందని వెల్లడించారు.