కూకట్ పల్లిలో ఘోర ప్రమాదం... బైక్ కి పెట్రోల్ కొట్టించి గాలి పట్టిస్తుండగా... పెట్రోల్ ట్యాంక్ పేలింది..!

కూకట్ పల్లిలో ఘోర ప్రమాదం... బైక్ కి పెట్రోల్ కొట్టించి గాలి పట్టిస్తుండగా... పెట్రోల్ ట్యాంక్ పేలింది..!

హైదరాబాద్ కూకట్ పల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. పెట్రోల్ బంక్ లో బైక్ కి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించిన తర్వాత గాలి పట్టిస్తుండగా బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలడం కలకలం రేపింది. మంగళవారం ( నవంబర్ 17 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

కూకట్ పల్లిలోని సుమిత్రనగర్ లో ఓ పెట్రోల్ బంక్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన పల్సర్ బైక్ కి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించిన తర్వాత గాలి పట్టిస్తుండగా ఒక్కసారిగా బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలింది.

ఈ ఘటనలో బైకర్ ఇస్లావత్ సాయికుమార్ కి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు సంభవించిన వెంటనే అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉందని.. చికిత్స అందిస్తున్నామని తెలిపారు వైద్యులు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.