Good Friends : ఇగో వద్దు... దోస్తుల మధ్య గ్యాప్ వస్తే ఇలా పరిష్కరించుకోండి.. హ్యాపీగా కలిసిపోతారు..!

Good Friends : ఇగో వద్దు... దోస్తుల మధ్య గ్యాప్ వస్తే ఇలా పరిష్కరించుకోండి.. హ్యాపీగా కలిసిపోతారు..!

ఏబంధం లేకపోయినా కష్టసుఖాల్లో పాల్పంచుకునే వాళ్లే ఫ్రెండ్స్. ఒకసారి మనసుకు దగ్గరైతే చాలు జీవితకాలం తోడుగా ఉంటారు. అటువంటి ఫ్రెండ్స్ మధ్య అప్పడప్పుడు మనస్పర్దలు వస్తుంటాయి, స్కూల్లో, కాలేజీల్లో, ఆఫీసుల్లో.. ఎక్కడో ఓ చోట ఇలాంటివి ఎదురవుతుంటాయి. ఆ మనస్పర్థలు స్నేహితుల మధ్య గ్యాప్ క్రియేట్ చేస్తాయి. ఆ గ్యాప్​ ని దూరం చేసుకోవడానికి ఈ టిప్స్. ఈ చిన్న చిన్న మార్గాల ద్వారా బెస్ట్ ఫ్రెండ్స్ కు మళ్లీ దగ్గరకావొచ్చు. బంధాన్ని మరింత బలంగా మార్చుకోవచ్చు.

మ నస్సర్థలు వచ్చిన తరువాత చాలామంది గ్యాప్ తీసుకుంటుంటారు. ఇలా కొంత టైం గ్యాప్ తీసుకోవడం మంచిదే. కానీ, అదే గ్యాపు కంటిన్యూ చేయకూడదు. అసలు సమస్య ఎక్కడ వచ్చిందో. ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. ఇద్దరూ విడిపోవడానికి బలమైన కారణం ఉందా? అనే విషయాన్ని వెతకాలి. దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. అప్పుడే స్నేహితుల మధ్య ఎక్కువ గ్యాప్ రాకుండా ఉంటుంది.

ముందడుగు వేయాల్సిందే

ఇద్దరిలో ఎవరి తప్పు ఉన్నా ఎవరో ఒకరు ముందడుగు వేయాలి. ప్రాబ్లమ్​ ను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. తప్పు ఎవరిదైనా అంగీకరించడానికి సిద్ధమవ్వాలి. లేదంటే క్షమించే గుణమైనా ఉండాలి. తప్పులు ఎత్తకుండా, "నేనే ముందు ఎందుకు మాట్లాడాలి..?" అని అనుకోకుండా ఫ్రెండ్ కు  కాల్, మెసేజ్ చేయడమో చేయాలి. లేదంటే ఇద్దరూ ఒకచోట కూర్చుని మాట్లాచుకోవాలి. దీంతో ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు పోతాయి.

నిందించొద్దు..


తప్పు ఎవరిదైనా నిందించకూడదు. ఒకవేళ తప్పు నిజంగా ఫ్రెండ్ దే అయినా ఆ విషయాన్ని పదే పదే చెప్పకూడదు. ఒకవేళ చెప్పాల్సి వస్తే నిదానంగా వివరించాలి. క్లారిటీగా చెప్పాలి. ఇద్దరి వైపు నుంచి ఆలోచిస్తున్నట్లే మాట్లాడాలి. అంతేగాని జరిగిపోయిన వాటిని గుర్తుచేస్తూ పొడిచినట్లు మాట్లాడకూడదు.

ఓపిక అవసరం

తప్పు ఎదుటివాళ్లదే అయినా. మీరే ముందడుగు వేసినా ఒకవేళ స్నేహితుడు మీ సంజాయిషీని అంగీకరించకపోతే బాధపదొద్దు.. 'నేనే ముందు మాట్లాడా. 'అన్నమాటలు ఇద్దరి మధ్య రాకూడదు. ఇలాంటి టైంలోనే ఓపిక అవసరం. క్లారిటీ ఇచ్చిన తరువాత అవతలివాళ్లు తిరిగి మాట్లాడకపోయినా... చెప్పేది అర్థం చేసుకోకపోయినా వాళ్లు ఆలోచించుకోడానికి కొంత టైం ఇవ్వాలి. అంతేగాని 'నేను మాట్లాడేశా, సువ్వుకూడా మాట్లాడు' అనే ధోరణి కరెక్ట్ కాదు.

పాజిటివ్ విషయాలే గుర్తుంచుకోవాలి

స్నేహితులతో విడిపోయి దూరంగా ఉన్నప్పుడు వాళ్ల గురించి పాజిటివ్ గానే ఆలోచించాలి. అంతకుముందు ఇద్దరి మధ్య జరిగిన మంచి మంచి సంఘటనలు గుర్తు చేసుకోవాలి. ఇలా పాజిటివ్ థింకింగ్​ లో ఉంటే ఇద్దరూ మళ్లీ కలిసి అవకాశం ఉంటుంది. అలాకాకుండా స్నేహితుడి గురించి నెగెటివ్ గా థింక్ చేయడం వల్ల రిలేషన్ మరింత దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది.

మూడో వ్యక్తి వద్దు

ఏ రిలేషన్​ లో నైనా ఇద్దరి మధ్యలో మరోవ్యక్తి రాకపోతేనే బెటర్. ఎవరి మధ్య గొడవలు వస్తే వాళ్లే పరిష్కరించుకోవాలి. మీడియేటర్స్ ఎంటరైతే ఆ గొడవ మరింత పెద్దగా అయ్యే అవకాశం ఉంది. అందుకే మూడో వ్యక్తి మాటే వద్దు.

ఇగోతోనే గ్యాస్

గొడవలు రావడం సహజం. వచ్చినా వాటిని పరిష్క రించు కోవడమే ముఖ్యం. ఒకవేళ పరిష్కరించక పోయినా పద్యార్వాలేదు కానీ, గొడవను ఇంకా పెంచుకోకూడదు. ముఖ్యంగా ఫ్రెండ్స్ మధ్య ఇగోలు ఉండకూడదు. ఇగోలతోనే గొడవలు వస్తుంటాయి.. గొడవలు వచ్చిన తరువాత కూడా ఇగోలతో గ్యాప్ ఇంకా పెరుగు తుంది తప్పు నీదే కాబట్టి నువ్వే మాట్లాడాలి. నీకే అంత లెవల్ ఉంటే నాకెంత ఉండాలి..' అనే ధోరణి పనికిరాదు ఫ్రెండ్ కోసం ఆలో చించాలి... తగ్గాలి. క్షమించాలి. ..అప్పుడే గ్యాప్ ఇంకా పెరగకుండా ఉంటుంది.