చివరి బంతి వరకు ఉత్కంఠ.. భారత్‌పై ఒక్క వికెట్ తేడాతో పాక్ విజయం

చివరి బంతి వరకు ఉత్కంఠ.. భారత్‌పై ఒక్క వికెట్ తేడాతో పాక్ విజయం

India vs Pakistan: బ్లైండ్ టీ20 ఆసియా కప్ 2026 (Blind T20 Asia Cup 2026)లో భాగంగా దాయాదులు భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగిన హై-వోల్టేజ్ పోరు చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠతో కొనసాగింది. గెలుపు అంచుల వరకు వెళ్లిన టీమిండియాకు చివరి రెండు బంతుల్లో పాకిస్థాన్ ఊహించని షాక్ ఇచ్చి గుండెకోత మిగిల్చింది. 180 పరుగుల లక్ష్య ఛేదనలో 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన పాక్.. లాస్ట్ బాల్ కి ఒక వికెట్ తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇటీవల అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో ఇండియా చేతిలో ఎదురైన ఓటమికి ఈ విజయంతో పాకిస్థాన్ బదులు తీర్చుకుంది. 

దుర్గా రావు హాఫ్ సెంచరీ.. భారత్ 179/6

* ఢాకా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 

* దుర్గా రావు మెరుపులు: భారత ఇన్నింగ్స్‌లో దుర్గా రావు (45 బంతుల్లో 61 పరుగులు) అద్భుతమైన అర్ధశతకంతో జట్టుకు వెన్నెముకగా నిలిచాడు.

* పాకిస్థాన్ బౌలర్లలో బదర్ మునీర్, బాబర్ అలీ తలో వికెట్ తీసి భారత్‌ను 180 పరుగుల లోపే కట్టడి చేశారు.

లాస్ట్ 2 బంతుల్లోనే మ్యాచ్ టర్నింగ్: 

180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్ నిసార్ అలీ (64 పరుగులు) శుభారంభం అందించాడు. కానీ భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో మ్యాచ్ లాస్ట్ ఓవర్ వరకు వెళ్లింది.

* నరాలు తెగే ఉత్కంఠ: చివరి రెండు బంతుల్లో పాకిస్థాన్ గెలవడానికి 7 రన్స్ అవసరం కాగా, అప్పటికే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. భారత్ విజయం ఖాయమని అంతా భావించారు.

* జునైద్ సిక్సర్ మ్యాజిక్: క్రీజులో ఉన్న జునైద్ ఇన్నింగ్స్ 19.5వ బంతిని భారీ సిక్సర్‌గా మలిచి ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. అనంతరం చివరి బంతికి కావాల్సిన ఒక్క పరుగు పూర్తి చేయడంతో పాకిస్థాన్ 20 ఓవర్లలో 180/9 స్కోరు చేసి థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. 

హ్యాట్రిక్ విజయాలతో ఫైనల్‌లోకి పాకిస్థాన్: 

ఈ టోర్నీలో పాకిస్థాన్‌కు ఇది వరుసగా మూడో గెలుపు.. అంతకుముందు బంగ్లాదేశ్‌పై 126 రన్స్ తేడాతో, శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో గెలిచిన పాక్.. ఇప్పుడు భారత్‌ను ఓడించి నవంబర్ 20 (శుక్రవారం) జరగనున్న ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.