అక్వాన్ తుఫాను ఏపీ వైపు దూసుకొస్తోంది... తుఫాను కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. అయితే.. కోస్తాంధ్ర దగ్గర తీరం దాటుతుందని అనుకున్న అక్వాన్ తుఫాను ఇప్పుడు కోనసీమ వైపు దిశ మార్చుకుందని తెలిపింది వాతావరణ శాఖ. దీంతో మరోసారి కోనసీమకు పెనుముప్పు సంభవించనుందని తెలుస్తోంది. అక్వాన్ తుఫాను కోనసీమ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని.. దీంతో కోరంగి ఉప్పాడ తీరాలకు ఉప్పెన ప్రమాదం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
తుఫాను కాకినాడకు దక్షిణంగా, మచిలీపట్నంకు ఉత్తరంగా తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు.ఈ క్రమంలో కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రస్తుతం 3 కి.మీ వేగంతో తుఫాను కదులుతోందని.. కొద్ది గంటల్లో తీవ్ర తుపాన్‌గా మారే ప్రమాదం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తుపాన్ కేంద్రీకృతమైందని.. ప్రస్తుతానికి చెన్నైకి 600 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 650 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 660 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 780 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైందని తెలిపింది వాతావరణ శాఖ.
గడిచిన 6 గంటల్లో గంటకి 3 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదిలిందని.. ఇవాళ తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. పశ్చిమ-వాయవ్య దిశలో ప్రయాణిస్తూ నవంబర్ 19 ఉదయానికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు - విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉందని.. రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది వాతావరణ శాఖ.
శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు - తుని మధ్య అక్వాన్ తుపాను తీరం దాటే అవకాశం ఉందని.. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో గరిష్ఠంగా 145 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఈ క్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్లోద్దని... తుఫాను ప్రభావంతో రేపు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
గురు, శుక్రవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. తుపాను సమస్యల పరిష్కారం కోసం 'మన మిత్ర' వాట్సాప్ నంబర్ 9552300009, అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101 నంబర్లను సంప్రదించాలని తెలిపింది వాతావరణ శాఖ.
