తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని ఖమ్మంజిల్లా సత్తుపల్లిలో జరిగిన చేయూత లబ్దిదారు పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి తెలిపారు. ధనికంగా ఏర్పడిన తెలంగాణను దొరలు పదేండ్లు పాలించి అప్పుల పాలు చేసి తమకు అప్పగించారన్నారు. బీఆర్ఎస్ నాయకుల మాదిరిగామాయమాటలు చెప్పడం.. దోచుకోవడం మా ప్రభుత్వానికి రాదని మంత్రి పొంగులేటి అన్నారు.
బీఆర్ఎస్ ఏలిన దొరల పాలనలో ప్రజల సొమ్మును పంజాబ్ లో ఖర్చు పెడితే.... కాంగ్రెస్ ప్రభుత్వం.. హైదరాబాద్ గొప్పతనాన్ని చాటేందుకు భారత్ సమ్మిట్కార్యక్రమం చేస్తుందన్నారు. గతంలో కేసులు ఎత్తి వేసేందుకు రాత్రికి రాత్రే బీజేపీ నాయకుడు సీఎం రమేష్ చేతులు పట్టుకున్న విషయం తెలియదా అని ప్రశ్నించారు.
గతంలో సోనియమ్మ ను దేవత అన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మరోలా అంటున్నారని మంత్రి పొంగులేటి అన్నారు. గత ప్రభుత్వం లో క్వశ్చన్ పేపర్ లు అమ్ముకున్నారంటూ.. ఇప్పుడు పదవులు పోయాయాని విషం కక్కుతున్నారని.. కేటీఆర్ పగటికలలు మానుకోవవాలని హితవు పలికారు.
ప్రజలు ఆశీర్వదించి దీవించిన ప్రజా ప్రభుత్వం, పేదవాళ్ళ ప్రభుత్వమని.. సీఎం రేవంత్ పాలనలో పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంట్, పేదలకు సన్నబియ్యం ఇచ్చేలా కాంగ్రెస్ ఇస్తుందని.. బీఆర్ఎస్ పదేళ్ల సాలనలో ఒక్కరేషన్ కార్డు కూడా ఇవ్వలేదని.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత అర్హులైన వారందరికి రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమంటూ.. 33 నెలల్లో 73 వేల కోట్ల రూపాయలను సున్నా వడ్డీకి ఇచ్చి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ఆనాడు వరి వేస్తే ఉరి అని చెప్తే, రైతన్నకి మద్దతు ధరతో పాటు అదనంగా 500 రూపాయలు ఇచ్చి అన్నదాతలను ఆదుకుందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కమిషన్ల కోసం కాలేశ్వరంకి లక్షల కోట్లు ఖర్చుపెడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇల్లు కట్టించామని.. మొదటి విడత రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ళు .. రెండో విడత 2.5 లక్షల ఇళ్ళు.. హైదరాబాద్ లో లక్ష ఇళ్ళు ఇచ్చామన్నారు.ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ముందు మీ గత చరిత్రను గుర్తుతెచ్చుకోవాలని బీఆర్ఎస్ నాయకులకు సూచించారు.
