టీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ ఇన్ చార్జిగా అనిత చౌదరి

టీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ ఇన్ చార్జిగా అనిత చౌదరి

ఖమ్మం, వెలుగు:  తెలంగాణ రక్షణ సేన ఖమ్మం పార్లమెంట్ ఇన్​చార్జిగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పల నరసింహపురానికి చెందిన నల్లమోతు అనిత చౌదరి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ చీఫ్​కల్వకుంట్ల కవిత నియామక ఉత్తర్వులు జారీ చేశారు. అనిత చౌదరి 16 ఏళ్లుగా కల్వకుంట కవితతో కలిసి అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు. 

మహిళా సాధికారత, మహిళా జాగృతి, రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యతపై రాష్ట్రస్థాయిలో ఉద్యమాలు చేశారు. తను చేసిన సేవలకు, ఉద్యమాలకు గుర్తింపుగా ఈ పదవి దక్కిందని ఆమె తెలిపారు. కల్వకుంట్ల కవితకి ధన్యవాదాలు చెప్పారు.