నవంబర్ 26న దేశవ్యాప్తంగా‘సంవిధాన్ రక్షా మార్చ్’..కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటన

నవంబర్ 26న దేశవ్యాప్తంగా‘సంవిధాన్ రక్షా మార్చ్’..కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటన

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ), చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలికి నిరసనగా రాజ్యాంగ దినోత్సవం రోజు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ‘సంవిధాన్ రక్షా మార్చ్’ పేరుతో ఈ నెల 26న అన్ని రాష్ట్రాల రాజధాని నగరాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు.

బూత్ స్థాయి వరకు ‘ఓట్ రక్షక్’ల నియామకం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా తొలగించిన ఓట్లు, తప్పులపై క్షేత్రస్థాయిలో పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ప్రతి బూత్‌లోనూ ‘ఓట్ రక్షక్’ లను నియమించాలని నిర్ణయించింది. రాష్ట్రాలవ్యాప్తంగా మండల స్థాయి వరకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, డిసెంబర్ 15 నాటికి బూత్ స్థాయి కమిటీలు, వాలంటీర్ల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ నాయకత్వం నిర్దేశించింది.