ప్రతి అమ్మాయి కలను నిజం చేసే కథ ఆకాశంలో ఒకతార : అల్లు అర్జున్

ప్రతి అమ్మాయి కలను నిజం చేసే కథ ఆకాశంలో ఒకతార : అల్లు అర్జున్

దుల్కర్ సల్మాన్‌‌, సాత్విక వీరవల్లి జంటగా పవన్ సాధినేని రూపొందించిన  చిత్రం ‘ఆకాశంలో ఒకతార’.  శృతిహాసన్ కీలక పాత్ర పోషించింది.   గీతా ఆర్ట్స్‌‌,  స్వప్న సినిమా సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించారు. నవంబర్ 20న పాన్ ఇండియావైడ్‌‌గా సినిమా విడుదల కానుంది. ఆదివారం హైదరాబాద్‌‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ నిర్వహించారు. 

అతిథిగా హాజరైన హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘దుల్కర్ అద్భుతమైన నటుడు.  విభిన్న భాషల్లో మంచి కథలను ఎంచుకుంటూ విజయాలు అందుకుంటున్నాడు.  ‘ఆకాశంలో ఒక తార’ ఆయన కెరీర్‌‌లో మరో మైలురాయిగా నిలుస్తుంది.  ప్రతి అమ్మాయి కలను నెరవేర్చాలనే అందమైన కథతో తెరకెక్కిన ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది’ అని చెప్పాడు.  

హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ‘‘సీతారామం’ తర్వాత విన్న ఈ కథ నాకెంతో  ప్రత్యేకంగా అనిపించింది. నా కెరీర్‌‌లో గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుందని నమ్ముతున్నా’ అని అన్నాడు. దర్శకుడు పవన్ సాధినేని మాట్లాడుతూ ‘ఈ సినిమా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందిస్తుంది. ఈ  కథపై నమ్మకంతో ముందుకు వచ్చిన నిర్మాతలకు, నన్ను ఎంతగానో ప్రోత్సహించిన దుల్కర్‌‌కు కృతజ్ఞతలు’ అని చెప్పాడు.  

దుల్కర్ గారితో కలిసి పనిచేయడం చాలా గొప్ప ఎక్స్‌‌పీరియన్స్ అని ఆయన స్నేహాన్ని  ఎప్పటికీ మర్చిపోలేనని  హీరోయిన్ సాత్విక  చెప్పింది. ఈ కథ చాలామందిని ఇన్‌‌స్పైర్ చేసేలా ఉంటుందని,  సినిమా విజయంపై చాలా నమ్మకంగా ఉన్నామని నిర్మాతలు అల్లు అరవింద్, స్నప్నదత్, సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం అన్నారు.  నటీనటులు రుహానీ శర్మ, స్వసిక విజయన్, చైతన్య జొన్నలగడ్డ, స్ర్కీన్‌‌ప్లే రైటర్ గుణ్ణం గంగరాజు,  మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్, లిరిక్ రైటర్ శ్రీమణి పాల్గొన్నారు.