ట్యాంక్ బండ్,వెలుగు: బిహార్ సమాజ్ ఆధ్వర్యంలో ఆదివారం హుస్సేన్ సాగర్ తీరంలో వైభవంగా ఛట్‌పూజ జరుపుకున్నారు. బిహార్ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరై పూజలు చేశారు.
ఛట్‌పూజ మహిళలు చేసే కఠినమైన వ్రతాలలో ఒకటని, సూర్య భగవానుడిని ఆరాధించే ఈ పండుగ సామాజిక ఐక్యతకు, భక్తి భావానికి ప్రతీక అని అన్నారు. ఈ సందర్భంగా హుస్సేన్‌సాగర్ తీరంతో పాటు బేబీ పాండ్స్‌లో బిహారీలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సారి స్పెషల్‌గా కాశీ తరహాలో కన్నుల పండువగా గంగా పూజ మహోత్సవాన్ని నిర్వహించారు.
