భారత్ సమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బీజేపీ ద్వంద్వ వైఖరి..పీయూష్ గోయల్ మెచ్చితే.. బండి సంజయ్ వ్యతిరేకిస్తారా?: చరణ్ కౌశిక్ యాదవ్

భారత్ సమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బీజేపీ ద్వంద్వ వైఖరి..పీయూష్ గోయల్ మెచ్చితే.. బండి సంజయ్ వ్యతిరేకిస్తారా?: చరణ్ కౌశిక్ యాదవ్

హైదరాబాద్, వెలుగు: భారత్ సమిట్‌తో రాష్ట్రం అపవిత్రమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అనడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ప్రగతిని అవమానించడమేనని తెలంగాణ లైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాక్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఏజెన్సీ చైర్మన్(టీజీఎల్​డీఏ) చరణ్ కౌశిక్ యాదవ్ విమర్శించారు. గతంలో ఢిల్లీలో జరిగిన కర్టెన్–రైజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరై అభినందిస్తే.. ఇప్పుడు సంజయ్ దేశద్రోహం అనడం బీజేపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.

సమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కౌలు రైతుల స్టాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జోక్ అనడం సిగ్గుచేటని, రైతు భరోసా, కౌలు రైతులకు రూ.500 బోనస్, యువతకు ఉపాధితోపాటు రాహుల్ గాంధీ చేతుల మీదుగా గిగ్ వర్కర్ల పాలసీ, ఆరోగ్య భద్రతను అమలు చేస్తుండటాన్ని చూసి ఓర్వలేకనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఓటర్ల జాబితా సవరణపై ప్రజాస్వామ్య పద్ధతిలో రాహుల్ గాంధీ ప్రశ్నిస్తుంటే దేశద్రోహంతో ముడిపెట్టడం సరికాదన్నారు.